తగు నీకూ నాపెకును తమకించి పెనఁగఁగ
(॥పల్లవి॥)
తగు నీకూ నాపెకును తమకించి పెనఁగఁగ
మొగములు చూచుకోఁగా మొరయనేలే
(॥తగు॥)
చనవు గలిగినాపె సారె సారె నీతోను
మనవులు చెప్పఁగాను మచ్చరమేల
ననిచి యప్పటి నీతో నవ్వులెల్లా నవ్వఁగాను
కొన చూపులనుఁ జూచి కోపగించనేల
(॥తగు॥)
చిత్తము వచ్చిన యాపె చేరి నిన్నుఁ జెనకఁగా
హత్తుకొని నిన్ను వెంగేలాడఁగ నేల
బత్తిగలిగినది నీపైఁ బన్నీరు చల్లఁగా
కొత్త కొత్త మాటలను కొసర నేల
(॥తగు॥)
చుట్టమై యుండిన యాపె సొరది నిన్నుఁ గూడఁగా
బట్ట బయలీఁదించి పంగించనేలా
యిట్టె శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నేఁడు
గుట్టు చేసుకొందుఁగాక గురిచూపనేలా
(||pallavi||)
tagu nīgū nābĕgunu tamagiṁchi pĕnam̐gam̐ga
mŏgamulu sūsugom̐gā mŏrayanele
(||tagu||)
sanavu galiginābĕ sārĕ sārĕ nīdonu
manavulu sĕppam̐gānu machcharamela
nanisi yappaḍi nīdo navvulĕllā navvam̐gānu
kŏna sūbulanum̐ jūsi kobagiṁchanela
(||tagu||)
sittamu vachchina yābĕ seri ninnum̐ jĕnagam̐gā
hattugŏni ninnu vĕṁgelāḍam̐ga nela
battigaliginadi nībaim̐ bannīru sallam̐gā
kŏtta kŏtta māḍalanu kŏsara nela
(||tagu||)
suṭṭamai yuṁḍina yābĕ sŏradi ninnum̐ gūḍam̐gā
baṭṭa bayalīm̐diṁchi paṁgiṁchanelā
yiṭṭĕ śhrī veṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
guṭṭu sesugŏṁdum̐gāga gurisūbanelā