తగినట్టే మెలఁగితే దైవమైనాఁ గరఁగును
(॥పల్లవి॥)
తగినట్టే మెలఁగితే దైవమైనాఁ గరఁగును
వెగటుగా నడచితే విసిగించు వలపు
(॥॥)
చేసినట్టే సేయవయ్య సేయకుమంటే నంత
వేసరుకొందువో ఆండ్లు వేవేలు నీకు
ఆసపడ్డదాన నేను అయినంత మేలే చాలు
వాసులెంచ బోతేను వడిఁబడు వలపు
(॥॥)
ఆడినట్టే ఆడవయ్య ఆడకుమంటే నెంత
జాడ తప్పుదువో పెక్కుసతులు నీకు
తోడఁ బెండ్లికూఁతురను దొరకినంతే చాలు
పాడి పంతాలకుఁ బోతే పచ్చిదేరు వలపు
(॥॥)
చూచినట్టే చూడవయ్య చూడకుమంటే నెంత
యేచి తమకింతువో నీకింతులు శాన
కాచుక శ్రీవేంకటేశ కైకొని నన్నేలితివి
వాచవి మోవడిగితే వన్నె కెక్కు వలపు
(||pallavi||)
taginaṭṭe mĕlam̐gide daivamainām̐ garam̐gunu
vĕgaḍugā naḍaside visigiṁchu valabu
(||||)
sesinaṭṭe seyavayya seyagumaṁṭe naṁta
vesarugŏṁduvo āṁḍlu vevelu nīgu
āsabaḍḍadāna nenu ayinaṁta mele sālu
vāsulĕṁcha bodenu vaḍim̐baḍu valabu
(||||)
āḍinaṭṭe āḍavayya āḍagumaṁṭe nĕṁta
jāḍa tappuduvo pĕkkusadulu nīgu
toḍam̐ bĕṁḍligūm̐turanu dŏraginaṁte sālu
pāḍi paṁtālagum̐ bode pachchideru valabu
(||||)
sūsinaṭṭe sūḍavayya sūḍagumaṁṭe nĕṁta
yesi tamagiṁtuvo nīgiṁtulu śhāna
kāsuga śhrīveṁkaḍeśha kaigŏni nannelidivi
vāsavi movaḍigide vannĕ kĕkku valabu