తగినంతే చాలుఁ జాలు తమకములు
(॥పల్లవి॥)
తగినంతే చాలుఁ జాలు తమకములు
నగిన మాత్రములోనే ననుపయ్యీనా
(॥తగి॥)
పలుమారు నిన్నునెంత బలుములు సేసినాను
వలపు గలంతే కాక వచ్చేవా నీవు
పిలువనై తినంటా పెడరేఁగి కొసరేవు
చలము సాదించఁ బోతే చవి వుట్టీనా
(॥తగి॥)
జాడతోడ నిన్ను నెంత చనవులు నెరసినా
వేడుక గలంతేకాక వియ్యమందేవా
వీడె మియ్యనైతినంటా వెసఁదప్పులు వట్టేవు
వాడికలు చూపితేనే వయిపయ్యీనా
(॥తగి॥)
మెట్టి పట్టి నీతో నెంత మేలములాడినాను
చుట్టరిక మింతే కాక సొంపు గూడీనా
నెట్టుక శ్రీ వేంకటేశ నేఁడు నన్నుఁ గూడితివి
బట్టిబయ లీఁదఁబోతే పనికి వచ్చీనా
(||pallavi||)
taginaṁte sālum̐ jālu tamagamulu
nagina mātramulone nanubayyīnā
(||tagi||)
palumāru ninnunĕṁta balumulu sesinānu
valabu galaṁte kāga vachchevā nīvu
piluvanai tinaṁṭā pĕḍarem̐gi kŏsarevu
salamu sādiṁcham̐ bode savi vuṭṭīnā
(||tagi||)
jāḍadoḍa ninnu nĕṁta sanavulu nĕrasinā
veḍuga galaṁtegāga viyyamaṁdevā
vīḍĕ miyyanaidinaṁṭā vĕsam̐dappulu vaṭṭevu
vāḍigalu sūbidene vayibayyīnā
(||tagi||)
mĕṭṭi paṭṭi nīdo nĕṁta melamulāḍinānu
suṭṭariga miṁte kāga sŏṁpu gūḍīnā
nĕṭṭuga śhrī veṁkaḍeśha nem̐ḍu nannum̐ gūḍidivi
baṭṭibaya līm̐dam̐bode panigi vachchīnā