తగినంతె పొందు చాలు దండము నీకు
(॥పల్లవి॥)
తగినంతె పొందు చాలు దండము నీకు
వొగి నిన్ను నేమన్నా నొట్లు వెట్టుదువూ
(॥తగి॥)
కందువ లన్నియుఁ జేసి కడపటనుండివచ్చి
అందగారిమాటాడుదు వప్పటి నీవు
మందెమేళమున నీతో మచ్చరించక మానము
గొందినుండి నీ కంతలోఁ గోపమెల్లా వచ్చును
(॥తగి॥)
ధీరత నీయిచ్చ నుండి తేరకాండ్లనుఁ దెచ్చి
తారుకాణించఁ జూతువు దంటతనాన
నేరములు నిన్ను నెంచి నిజమాడక మానము
బీర మెక్కు నీ కప్పుడు ప్రియసతులోద్దను
(॥తగి॥)
చేయఁగలవెల్లాఁ జేసి చేసూటికి రాకున్న
యీయెడ నన్నుఁగూడుదు విటువలెనే
ఆయమై శ్రీవేంకటేశ అంతలో నేఁ గైకొందు
పాయపుమదము నీకుఁ బైకొని విడువదు
(||pallavi||)
taginaṁtĕ pŏṁdu sālu daṁḍamu nīgu
vŏgi ninnu nemannā nŏṭlu vĕṭṭuduvū
(||tagi||)
kaṁduva lanniyum̐ jesi kaḍabaḍanuṁḍivachchi
aṁdagārimāḍāḍudu vappaḍi nīvu
maṁdĕmeḽamuna nīdo machchariṁchaga mānamu
gŏṁdinuṁḍi nī kaṁtalom̐ gobamĕllā vachchunu
(||tagi||)
dhīrada nīyichcha nuṁḍi teragāṁḍlanum̐ dĕchchi
tārugāṇiṁcham̐ jūduvu daṁṭadanāna
neramulu ninnu nĕṁchi nijamāḍaga mānamu
bīra mĕkku nī kappuḍu priyasaduloddanu
(||tagi||)
seyam̐galavĕllām̐ jesi sesūḍigi rāgunna
yīyĕḍa nannum̐gūḍudu viḍuvalĕne
āyamai śhrīveṁkaḍeśha aṁtalo nem̐ gaigŏṁdu
pāyabumadamu nīgum̐ baigŏni viḍuvadu