Tagili paayuda kamte davvula numdude melu

తగిలి పాయుట కంటే దవ్వుల నుండుటే మేలు
Language

(॥పల్లవి॥)
తగిలి పాయుట కంటే దవ్వుల నుండుటే మేలు
అగపడ్డ మోహము లాపలేని వారికి

(॥॥)
కూడిమాడి పాందు సేసి కొసరఁగవచ్చుఁ గాని
వీడుఁవడ్డ విరహాన వేఁగరాదు
వేడుకఁ దప్పక చూచి వెలయఁగవచ్చుఁ గాని
వోడక రెప్ప మూసితే నోరువరాదు

(॥॥)
గరిమ మొదల బిగ్గిఁ గౌఁగిలించవచ్చుఁ గాని
వరుస వెనక మరి వదలరాదు
సరసపు మాటలు సారె నాడవచ్చుఁ గాని
మరిగిన మీఁద మఱవఁగరాదు

(॥॥)
కలసి మెలసి యట్టే కడు నవ్వవచ్చుఁ గాని
తలపునఁ గలమేలు దాఁచఁగరాదు
అలమేలుమంగ పతి యైన శ్రీ వేంకటేశుఁడు
యెలమి ని న్నేలె నిఁక నింతం తనరాదు

(||pallavi||)
tagili pāyuḍa kaṁṭe davvula nuṁḍuḍe melu
agabaḍḍa mohamu lābaleni vārigi

(||||)
kūḍimāḍi pāṁdu sesi kŏsaram̐gavachchum̐ gāni
vīḍum̐vaḍḍa virahāna vem̐garādu
veḍugam̐ dappaga sūsi vĕlayam̐gavachchum̐ gāni
voḍaga rĕppa mūside noruvarādu

(||||)
garima mŏdala biggim̐ gaum̐giliṁchavachchum̐ gāni
varusa vĕnaga mari vadalarādu
sarasabu māḍalu sārĕ nāḍavachchum̐ gāni
marigina mīm̐da maṟavam̐garādu

(||||)
kalasi mĕlasi yaṭṭe kaḍu navvavachchum̐ gāni
talabunam̐ galamelu dām̐sam̐garādu
alamelumaṁga padi yaina śhrī veṁkaḍeśhum̐ḍu
yĕlami ni nnelĕ nim̐ka niṁtaṁ tanarādu