తగిలి నేఁ దడవితేఁ దడవఁగవలెఁ గాక
(॥పల్లవి॥)
తగిలి నేఁ దడవితేఁ దడవఁగవలెఁ గాక
మిగుల వాసికానికి మేరమీరఁ జెల్లునా
(॥॥)
చూడకుండఁగానే తాను చూచీ తప్పక నన్ను
యేడాను జగడగాని కింతగలదా
ఆడకుండఁగానే మాటలాడించీ నూరకైన
జాడతో మాసటీనికి చంచలము చెల్లునా
(॥॥)
ఇంటికిఁ బోఁకుండఁగ మాఇంటికి వచ్చీఁ దాను
అంటి చలపాదిగాని కది దగునా
అంటుకోకుండఁగ తానే అంటుకొనీ నామేను
దంటపంతగానికి దైన్యమింత చెల్లునా
(॥॥)
కాఁగిలించకుండఁగానే కాఁగిలించీ నిదె నన్ను
యేఁగేటియెమ్మెకానికి నిది దగునా
కాఁగిననన్ను శ్రీ వేంకటపతి యిదె కూడె
చేఁగదేరేదొరలకు చేఁత లింత చెల్లునా
(||pallavi||)
tagili nem̐ daḍavidem̐ daḍavam̐gavalĕm̐ gāga
migula vāsigānigi meramīram̐ jĕllunā
(||||)
sūḍaguṁḍam̐gāne tānu sūsī tappaga nannu
yeḍānu jagaḍagāni kiṁtagaladā
āḍaguṁḍam̐gāne māḍalāḍiṁchī nūragaina
jāḍado māsaḍīnigi saṁchalamu sĕllunā
(||||)
iṁṭigim̐ bom̐kuṁḍam̐ga māiṁṭigi vachchīm̐ dānu
aṁṭi salabādigāni kadi dagunā
aṁṭugoguṁḍam̐ga tāne aṁṭugŏnī nāmenu
daṁṭabaṁtagānigi dainyamiṁta sĕllunā
(||||)
kām̐giliṁchaguṁḍam̐gāne kām̐giliṁchī nidĕ nannu
yem̐geḍiyĕmmĕgānigi nidi dagunā
kām̐ginanannu śhrī veṁkaḍabadi yidĕ kūḍĕ
sem̐gaderedŏralagu sem̐ta liṁta sĕllunā