తగిలి నాచేఁతలలో తప్పులు లోఁగొనవయ్య
(॥పల్లవి॥)
తగిలి నాచేఁతలలో తప్పులు లోఁగొనవయ్య
మొగిచిన చేతులతో మొక్కేను నీకును
(॥తగి॥)
శిరసు మజ్జనమార్చి విరులు నే ముడువఁగా
ఆరిది నాగోరేడనంటెనో నిన్ను
గరిమ నీమేన నిండా కస్తూరి నేఁ బూయఁగాను
వొరసి నాగుబ్బ లెంత వొత్తెవే నిన్ను
(॥తగి॥)
మిక్కుటపు సొమ్ములు నీమేన నిండాఁబెట్టఁగాను
చెక్కుల నాచెమటెంత చిందెనో నీపై
అక్కరతో విడెమిచ్చి అండ నిలుచుండఁగాను
గక్కన నానీడ యెంత గప్పెనో నీపైని
(॥తగి॥)
గాఁటపునీరతుల నేఁ గాఁగిలించి కూడఁగాను
సూటి నానిట్టూర్పు లెంత సోఁ కెనో నేఁడు
యీటున శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
తాటించి నావలపెంత తగిలెనో నేఁడు
(||pallavi||)
tagili nāsem̐talalo tappulu lom̐gŏnavayya
mŏgisina sedulado mŏkkenu nīgunu
(||tagi||)
śhirasu majjanamārsi virulu ne muḍuvam̐gā
āridi nāgoreḍanaṁṭĕno ninnu
garima nīmena niṁḍā kastūri nem̐ būyam̐gānu
vŏrasi nāgubba lĕṁta vŏttĕve ninnu
(||tagi||)
mikkuḍabu sŏmmulu nīmena niṁḍām̐bĕṭṭam̐gānu
sĕkkula nāsĕmaḍĕṁta siṁdĕno nībai
akkarado viḍĕmichchi aṁḍa nilusuṁḍam̐gānu
gakkana nānīḍa yĕṁta gappĕno nībaini
(||tagi||)
gām̐ṭabunīradula nem̐ gām̐giliṁchi kūḍam̐gānu
sūḍi nāniṭṭūrbu lĕṁta som̐ kĕno nem̐ḍu
yīḍuna śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
tāḍiṁchi nāvalabĕṁta tagilĕno nem̐ḍu