Tagavulu seppumanee damdane nee ramanumdu

తగవులు చెప్పుమనీ దండనే నీ రమణుఁడు
Language

(॥పల్లవి॥)
తగవులు చెప్పుమనీ దండనే నీ రమణుఁడు
మొగము చూపరాదా మునికొనిఁ(నీ? న?) వలపు

(॥॥)
నీవాతని వెంగెమాడ నేరిచినదానవు
యీవేళ నిట్టె పంతమియ్య నేరవా
చేవదేర బుద్దులెల్లాఁ జెప్పేరు నీకుఁ జెలులు
వోవరిలోఁ దలవంచు కూరకుండనేఁటికే

(॥॥)
సంగడినే బొమ్మల జంకించినదానవు
ముంగిటి కాతఁడు వస్తే మొక్కఁగవద్దా
చెంగట నుండి నీతులు చిలుకలు చదివీని
సంగతి దెలుసుక యిచ్చక మాడఁదగదా

(॥॥)
శ్రీవేంకటేశ్వరుఁ జేరి కూడినదానవు
సేవ లలమేల్మంగవు సేయఁగవద్దా
కావరపుఁబావురాలు గక్కున రతులు చూపీ
నీవు నాతఁడును నిట్టె నెలకొనఁ జెల్లునే

(||pallavi||)
tagavulu sĕppumanī daṁḍane nī ramaṇum̐ḍu
mŏgamu sūbarādā munigŏnim̐(nī? na?) valabu

(||||)
nīvādani vĕṁgĕmāḍa nerisinadānavu
yīveḽa niṭṭĕ paṁtamiyya neravā
sevadera buddulĕllām̐ jĕpperu nīgum̐ jĕlulu
vovarilom̐ dalavaṁchu kūraguṁḍanem̐ṭige

(||||)
saṁgaḍine bŏmmala jaṁkiṁchinadānavu
muṁgiḍi kādam̐ḍu vaste mŏkkam̐gavaddā
sĕṁgaḍa nuṁḍi nīdulu silugalu sadivīni
saṁgadi dĕlusuga yichchaga māḍam̐dagadā

(||||)
śhrīveṁkaḍeśhvarum̐ jeri kūḍinadānavu
seva lalamelmaṁgavu seyam̐gavaddā
kāvarabum̐bāvurālu gakkuna radulu sūbī
nīvu nādam̐ḍunu niṭṭĕ nĕlagŏnam̐ jĕllune