తగవు నీవెరఁగవా తరుణి నేల దూరేవు
(॥పల్లవి॥)
తగవు నీవెరఁగవా తరుణి నేల దూరేవు
నగుతా నాటకములు నడపేవు గాక
(॥తగ॥)
మాఁటాడించి రమణుఁడు మరిగించుకొనుఁ గాక
అఁటది సిగ్గుపడదా అందరిలోన
పాటించి లోనికి వచ్చి పవ్వళింతువు గాక
పీఁట వెట్టి రమ్మని పిలుతురా రతికి
(॥తగ॥)
కొద్దితోఁ బ్రియుఁడు మతికొంకు దేర్చవలెఁ గాక
ముద్దరా లెరుఁగునా మునుపె నవ్వ
వొద్దఁ బెట్టెకొని నీవె వొడి వట్టుదువు గాక
సుద్దు లడిగి చన్నులు చూపుదురా చెలులు
(॥తగ॥)
మన్నించి కాఁగిటఁ జేర్చి మగఁ డన్ని నేర్పుఁ గాక
కన్నియ పైకొనునా కాఁతాళానను
యెన్నిక శ్రీవేంకటేశ యేలి మోవి యడిగేవు
సన్నల నలమేల్మంగ చాఁచునా సారెకును
(||pallavi||)
tagavu nīvĕram̐gavā taruṇi nela dūrevu
nagudā nāḍagamulu naḍabevu gāga
(||taga||)
mām̐ṭāḍiṁchi ramaṇum̐ḍu marigiṁchugŏnum̐ gāga
am̐ṭadi siggubaḍadā aṁdarilona
pāḍiṁchi lonigi vachchi pavvaḽiṁtuvu gāga
pīm̐ṭa vĕṭṭi rammani piludurā radigi
(||taga||)
kŏddidom̐ briyum̐ḍu madigŏṁku dersavalĕm̐ gāga
muddarā lĕrum̐gunā munubĕ navva
vŏddam̐ bĕṭṭĕgŏni nīvĕ vŏḍi vaṭṭuduvu gāga
suddu laḍigi sannulu sūbudurā sĕlulu
(||taga||)
manniṁchi kām̐giḍam̐ jersi magam̐ ḍanni nerbum̐ gāga
kanniya paigŏnunā kām̐tāḽānanu
yĕnniga śhrīveṁkaḍeśha yeli movi yaḍigevu
sannala nalamelmaṁga sām̐sunā sārĕgunu