తగవు నీ వెఱఁగవా తమకించేవు
(॥పల్లవి॥)
తగవు నీ వెఱఁగవా తమకించేవు
వొగరుఁ బ్రియములకు వోరుతురా చెలులు
(॥తగవు॥)
అక్కరతో నీకునాపె ఆకుమడిచియ్యఁగాను
కక్కసించి నీవే యలుకలు రేఁచేవు
చక్కఁగా వోజతోడుత సాజాన నుండినవారి-
నొక్కటొక్కటే సేసితే నోరుతురా చెలులు
(॥తగవు॥)
పనివడి యాపె నీకుఁ బాదములు విసుకగా
పెనఁగి చలములెల్లాఁ బెడరేఁచేవు
ఘనుఁడ నీతోఁ జుట్టరికమున నుండినవారి-
నొనర రాఁపుసేసితే నోరుతురా చెలులు
(॥తగవు॥)
కందువతో నాపె నిన్నుఁ గాఁగిలించి కూడఁగాను
మందలించి కూడచు మైమఱపించేవు
అందపు శ్రీ వేంకటేశ ఆండ్లైవుండిన వారి-
నొందిలి గోరనంటితే వోరుతురా చెలులు
(||pallavi||)
tagavu nī vĕṟam̐gavā tamagiṁchevu
vŏgarum̐ briyamulagu vorudurā sĕlulu
(||tagavu||)
akkarado nīgunābĕ āgumaḍisiyyam̐gānu
kakkasiṁchi nīve yalugalu rem̐sevu
sakkam̐gā vojadoḍuda sājāna nuṁḍinavāri-
nŏkkaḍŏkkaḍe seside norudurā sĕlulu
(||tagavu||)
panivaḍi yābĕ nīgum̐ bādamulu visugagā
pĕnam̐gi salamulĕllām̐ bĕḍarem̐sevu
ghanum̐ḍa nīdom̐ juṭṭarigamuna nuṁḍinavāri-
nŏnara rām̐puseside norudurā sĕlulu
(||tagavu||)
kaṁduvado nābĕ ninnum̐ gām̐giliṁchi kūḍam̐gānu
maṁdaliṁchi kūḍasu maimaṟabiṁchevu
aṁdabu śhrī veṁkaḍeśha āṁḍlaivuṁḍina vāri-
nŏṁdili goranaṁṭide vorudurā sĕlulu