(॥పల్లవి॥)
తగవో నగవో తలఁపిదివో
జగడము లేఁటికి సతమగు పనికి
(॥తగ॥)
పిలిచినయపుడే ప్రియమునఁ బలికితి
కలదో లేదో కనుఁగొనరే
అలుకయుఁ దనదే అఱడిఁ దనదే
తెలిసెనో తెలియదో తేరిన పనికి
(॥తగ॥)
కవకవ నవ్వినఁ గైకొని మొక్కితి
అవునో కాదో అడుగరే
అవల నివలఁ దనయాసలు మానఁడు
చివుకన నేఁటికిఁ జేసినపనికి
(॥తగ॥)
మనిపే ననఁగా మాటలు నమ్మితి
అనెనో అనఁడో అదెకదరే
యెనగొని శ్రీవేంకటేశుఁడు గూడెను
నను నొరయకురే ననిచిన పనికి
(||pallavi||)
tagavo nagavo talam̐pidivo
jagaḍamu lem̐ṭigi sadamagu panigi
(||taga||)
pilisinayabuḍe priyamunam̐ baligidi
kalado ledo kanum̐gŏnare
alugayum̐ danade aṟaḍim̐ danade
tĕlisĕno tĕliyado terina panigi
(||taga||)
kavagava navvinam̐ gaigŏni mŏkkidi
avuno kādo aḍugare
avala nivalam̐ danayāsalu mānam̐ḍu
sivugana nem̐ṭigim̐ jesinabanigi
(||taga||)
manibe nanam̐gā māḍalu nammidi
anĕno anam̐ḍo adĕgadare
yĕnagŏni śhrīveṁkaḍeśhum̐ḍu gūḍĕnu
nanu nŏrayagure nanisina panigi