Tagaveṟamganivaadaa taruniro neemagamdu

తగవెఱఁగనివాడా తరుణిరో నీమగఁడు
Language

(॥పల్లవి॥)
తగవెఱఁగనివాడా తరుణిరో నీమగఁడు
నగవులకొలఁదినే నాఁటుకొనీఁ గాక

(॥తగ॥)
సొలసేవు రమణుని సూటిదప్పకచూచేవు
కలసినందాఁకా నిట్టె కాంతాళించేవు
బలువులు చూపుదురా పతితోడ నింతేసి
కొలఁదెఱిఁగాతఁడే కూడీఁగాక

(॥తగ॥)
పెనఁగే వాతనితోడ బెట్టిమాటలాడెవు
తనువుసోఁకినదాఁకాఁ దమకించేవు
మొనలెత్తి చూపుదురా మొదలనే ఆతనితో
అనువెఱిఁగి తానే ఆదరించీఁగాక

(॥తగ॥)
కక్కసించి పిలిచేవు కరకరిఁబెట్టేవు
చిక్కిలోనైనదాఁకా చిమ్మిరేఁగేవు
యెక్కువ శ్రీవేంకటేశుఁ డితం డిట్టె నిన్నుఁ గూడె
మిక్కిలియాతఁడే నీకు మేలువాఁ డవుఁగాక

(||pallavi||)
tagavĕṟam̐ganivāḍā taruṇiro nīmagam̐ḍu
nagavulagŏlam̐dine nām̐ṭugŏnīm̐ gāga

(||taga||)
sŏlasevu ramaṇuni sūḍidappagasūsevu
kalasinaṁdām̐kā niṭṭĕ kāṁtāḽiṁchevu
baluvulu sūbudurā padidoḍa niṁtesi
kŏlam̐dĕṟim̐gādam̐ḍe kūḍīm̐gāga

(||taga||)
pĕnam̐ge vādanidoḍa bĕṭṭimāḍalāḍĕvu
tanuvusom̐kinadām̐kām̐ damagiṁchevu
mŏnalĕtti sūbudurā mŏdalane ādanido
anuvĕṟim̐gi tāne ādariṁchīm̐gāga

(||taga||)
kakkasiṁchi pilisevu karagarim̐bĕṭṭevu
sikkilonainadām̐kā simmirem̐gevu
yĕkkuva śhrīveṁkaḍeśhum̐ ḍidaṁ ḍiṭṭĕ ninnum̐ gūḍĕ
mikkiliyādam̐ḍe nīgu meluvām̐ ḍavum̐gāga