తగవెంచుకొన వలదా తరుణికిని
(॥పల్లవి॥)
తగవెంచుకొన వలదా తరుణికిని
మగఁడై కైకొన్నవాఁడు మరి యేమి సేసునే
(॥తగ॥)
జక్కవలవంటి నీ చన్నులు విసికెనంటా
వెక్కసా లాడే వదేమే విభునితోను
మిక్కిలి మరుబాణాలు మేలు గడురేఁ చఁ గాను
మక్కువ గలుగువాఁడు మరి యేమి సేసునే
(॥తగ॥)
చెంతనుండి నీ తురుము చేతఁ బట్టి తీసెనంటా
పంతము లాడేవేమే పతితోను
వింత వింతలై వయసు వేడుకలు వుట్టించఁగా
మంతనాన వున్నవాఁడు మరి యేమి సేసునే
(॥తగ॥)
చనవుతో నిప్పు డిట్టె సరసము లాడె నంటా
యెన సేవేమే శ్రీ వేంకటేశ్వరుతోను
తనువులో తమకము తతిగొని నుండఁ గాను
మనసు పెట్టినవాఁడు మరి యేమి సేసునే
(||pallavi||)
tagavĕṁchugŏna valadā taruṇigini
magam̐ḍai kaigŏnnavām̐ḍu mari yemi sesune
(||taga||)
jakkavalavaṁṭi nī sannulu visigĕnaṁṭā
vĕkkasā lāḍe vademe vibhunidonu
mikkili marubāṇālu melu gaḍurem̐ sam̐ gānu
makkuva galuguvām̐ḍu mari yemi sesune
(||taga||)
sĕṁtanuṁḍi nī turumu sedam̐ baṭṭi tīsĕnaṁṭā
paṁtamu lāḍeveme padidonu
viṁta viṁtalai vayasu veḍugalu vuṭṭiṁcham̐gā
maṁtanāna vunnavām̐ḍu mari yemi sesune
(||taga||)
sanavudo nippu ḍiṭṭĕ sarasamu lāḍĕ naṁṭā
yĕna seveme śhrī veṁkaḍeśhvarudonu
tanuvulo tamagamu tadigŏni nuṁḍam̐ gānu
manasu pĕṭṭinavām̐ḍu mari yemi sesune