Tagavari vannidaanu dayam joodavaladaa

తగవరి వన్నిటాను దయఁ జూడవలదా
Language

(॥పల్లవి॥)
తగవరి వన్నిటాను దయఁ జూడవలదా
వెగటుగాఁ జెలు లింత విన్నవించవలెనా

(॥॥)
కందువ నీ వేళలు గాచుక యాపె వుండఁగా
యెందుండో వచ్చి నవ్వీ యీలేమ నీతో
ముందు వెనక దెలిసి మోహము చేకొనవద్దా
సందు సుడికత్తెలకు చనవు లీఁ దగునా

(॥॥)
యెప్పుడు మాటాడే వంటా నీపెమోము చూడఁగా
దెప్పరమై కత చెప్పేదెరవ నీతో
తప్పకుండాఁ బెద్ద పిన్నంతరువులు చూడవద్దా
చిప్పిలఁ బొరుగువారిఁ జిమ్మి రేఁచవలెనా

(॥॥)
అలమేలుమంగ వురమందు నెక్కుకుండఁ గాను
వెలినున్నసతి నీతో వియ్య మందీని
యెలమి శ్రీ వేంకటేశ యిద్దరినిఁ గూడితివి
కెలనివారితోఁ బొత్తు గలపఁగ వలెనా

(||pallavi||)
tagavari vanniḍānu dayam̐ jūḍavaladā
vĕgaḍugām̐ jĕlu liṁta vinnaviṁchavalĕnā

(||||)
kaṁduva nī veḽalu gāsuga yābĕ vuṁḍam̐gā
yĕṁduṁḍo vachchi navvī yīlema nīdo
muṁdu vĕnaga dĕlisi mohamu segŏnavaddā
saṁdu suḍigattĕlagu sanavu līm̐ dagunā

(||||)
yĕppuḍu māḍāḍe vaṁṭā nībĕmomu sūḍam̐gā
dĕpparamai kada sĕppedĕrava nīdo
tappaguṁḍām̐ bĕdda pinnaṁtaruvulu sūḍavaddā
sippilam̐ bŏruguvārim̐ jimmi rem̐savalĕnā

(||||)
alamelumaṁga vuramaṁdu nĕkkuguṁḍam̐ gānu
vĕlinunnasadi nīdo viyya maṁdīni
yĕlami śhrī veṁkaḍeśha yiddarinim̐ gūḍidivi
kĕlanivāridom̐ bŏttu galabam̐ga valĕnā