తగవైన పను లివి తరుణుల కెల్లాను
(॥పల్లవి॥)
తగవైన పను లివి తరుణుల కెల్లాను
వెగటు గాకుండా నీకు విన్న వించే నిపుడు
(॥తగ॥)
కొచ్చికొచ్చి చూడవచ్చు కోపగించుకొనరాదు
పచ్చిగాఁ జెనకవచ్చు పదరరాదు
పచ్చిక సొలయవచ్చు మాఁటలు మీఱఁగరాదు
యిచ్చకమెఱిఁగినట్టియిల్లాండ్లకును
(॥తగ॥)
మనసు సోదించవచ్చు మంకులు నెరపరాదు
పెనుఁగులాడఁగవచ్చు బిగియరాదు
కొనగోర నూఁదవచ్చు కుచ్చితము సేయరాదు
యెనసివుండిన యట్టి యిల్లాండ్లకును
(॥తగ॥)
బొమ్మల జంకించవచ్చు పొంచి యెగ్గుపట్టరాదు
కుమ్మరించవచ్చు సిగ్గు గునియరాదు
నెమ్మి నలమేల్‌మంగను నేను శ్రీవేంకటేశుఁడ
యెమ్మెఁ గూడవచ్చు నావంటిల్లాండ్లకును
(||pallavi||)
tagavaina panu livi taruṇula kĕllānu
vĕgaḍu gāguṁḍā nīgu vinna viṁche nibuḍu
(||taga||)
kŏchchigŏchchi sūḍavachchu kobagiṁchugŏnarādu
pachchigām̐ jĕnagavachchu padararādu
pachchiga sŏlayavachchu mām̐ṭalu mīṟam̐garādu
yichchagamĕṟim̐ginaṭṭiyillāṁḍlagunu
(||taga||)
manasu sodiṁchavachchu maṁkulu nĕrabarādu
pĕnum̐gulāḍam̐gavachchu bigiyarādu
kŏnagora nūm̐davachchu kuchchidamu seyarādu
yĕnasivuṁḍina yaṭṭi yillāṁḍlagunu
(||taga||)
bŏmmala jaṁkiṁchavachchu pŏṁchi yĕggubaṭṭarādu
kummariṁchavachchu siggu guniyarādu
nĕmmi nalamelmaṁganu nenu śhrīveṁkaḍeśhum̐ḍa
yĕmmĕm̐ gūḍavachchu nāvaṁṭillāṁḍlagunu