Tagavaide nimtadanu dayadalamsamgavale

తగవైతే నింతటను దయదలఁచఁగవలె
Language

(॥పల్లవి॥)
తగవైతే నింతటను దయదలఁచఁగవలె
జిగి మా విన్నపములు చిత్తగించవయ్యా

(॥తగు॥)
వట్టిమాఁకు లిగిరించ వనిత మాఁటలాడీని
వెట్టికి నూఁకొనవద్దు వినవయ్యా
గుట్టుతో రాయి గరఁగఁ గొలువులు సేసీని
అట్టు నిట్టూఁ బరాకుగా కవధరించవయ్యా

(॥తగు॥)
కోటకిఁ బడగలెత్తి కుచములు నీకుఁ జూపీ
జూటుఁదనములు మాని చూడవయ్యా
తేటతెల్లములుగాను తెలసీ వావులు నీకు
నీటున సిగ్గువడక నెయ్యము చూపవయ్యా

(॥తగు॥)
పోఁకకుఁ బుట్టెఁడు సేసి పొందుగా వలపు లమ్మీ
యాఁకటలు దాఁచక అందుకోవయ్యా
కాఁకదీరఁ గాఁగిలించీ గక్కన శ్రీవేంకటేశ
వీఁకలు సేయక కూడి వెలయించవయ్యా

(||pallavi||)
tagavaide niṁtaḍanu dayadalam̐sam̐gavalĕ
jigi mā vinnabamulu sittagiṁchavayyā

(||tagu||)
vaṭṭimām̐ku ligiriṁcha vanida mām̐ṭalāḍīni
vĕṭṭigi nūm̐kŏnavaddu vinavayyā
guṭṭudo rāyi garam̐gam̐ gŏluvulu sesīni
aṭṭu niṭṭūm̐ barāgugā kavadhariṁchavayyā

(||tagu||)
koḍagim̐ baḍagalĕtti kusamulu nīgum̐ jūbī
jūḍum̐danamulu māni sūḍavayyā
teḍadĕllamulugānu tĕlasī vāvulu nīgu
nīḍuna sigguvaḍaga nĕyyamu sūbavayyā

(||tagu||)
pom̐kagum̐ buṭṭĕm̐ḍu sesi pŏṁdugā valabu lammī
yām̐kaḍalu dām̐saga aṁdugovayyā
kām̐kadīram̐ gām̐giliṁchī gakkana śhrīveṁkaḍeśha
vīm̐kalu seyaga kūḍi vĕlayiṁchavayyā