(॥పల్లవి॥)
తగదని చెప్పరే తరుణులాల
వెగటుఁ జేఁతల లేనివేసాలు చేసీని
(॥తగ॥)
సుద్దులడిగినవాఁడు సొరిది వినవలదా
వొద్దిక నే జెప్పం బోతే నొడ్డుకొనీని
అద్దుకొని తనమర్మమందు నేమైనా నున్నదా
పొద్దువోక తానే మాటపోలిక లెంచీని
(॥తగ॥)
సన్నలు చేసినవాఁడు చనవియ్యవలదా
చెన్నలర నే నంటితే సిగ్గువడీని
యెన్నరానిగిలిగింత లేమైనా నందున్నవా
తన్నుఁదానే విఱ్ఱవీఁగి తప్పించుకొనీని
(॥తగ॥)
చేరఁ బిలిచినవాఁడు చెక్కు నొక్కవలదా
తారి గుబ్బల నొత్తితేఁ దప్పించుకొనీ
ఆరీతి శ్రీవేంకటేశుఁ డలమేలుమంగ నేను
నేరుపుతో నన్నుఁగూడి నీటులు చూపీని
(||pallavi||)
tagadani sĕppare taruṇulāla
vĕgaḍum̐ jem̐tala lenivesālu sesīni
(||taga||)
suddulaḍiginavām̐ḍu sŏridi vinavaladā
vŏddiga ne jĕppaṁ bode nŏḍḍugŏnīni
addugŏni tanamarmamaṁdu nemainā nunnadā
pŏdduvoga tāne māḍaboliga lĕṁchīni
(||taga||)
sannalu sesinavām̐ḍu sanaviyyavaladā
sĕnnalara ne naṁṭide sigguvaḍīni
yĕnnarānigiligiṁta lemainā naṁdunnavā
tannum̐dāne viṭravīm̐gi tappiṁchugŏnīni
(||taga||)
seram̐ bilisinavām̐ḍu sĕkku nŏkkavaladā
tāri gubbala nŏttidem̐ dappiṁchugŏnī
ārīdi śhrīveṁkaḍeśhum̐ ḍalamelumaṁga nenu
nerubudo nannum̐gūḍi nīḍulu sūbīni