తగ నిన్నిటికి నిదే దండము సుమ్మీ
(॥పల్లవి॥)
తగ నిన్నిటికి నిదే దండము సుమ్మీ
నగితి నిందాఁక నీపై ననుపునఁ జుమ్మీ
(॥తగ॥)
అనరానిమాటలెల్ల నాడుదు నిన్నెందుకైనా
మునుకొని నీమీఁది మోహమేసుమీ
పనివడి నిన్నుఁ గొంగువట్టితీతు నొకవేళ
చనవున నీవిచ్చినసలిగెలఁ జుమ్మీ
(॥తగ॥)
పంతమున నీమీఁద పక్కనఁ జేయి చాఁచితే
అంతయును నీమీఁది ఆసలేసుమ్మీ
సంతమై నిన్ను బొమ్మల జంకించి అదలింతును
వింతలైన నీమీఁదివేడుకలెసుమ్మీ
(॥తగ॥)
కదిసి నిన్నుఁ గాఁగిట కడుబిగించితే నేను
పొదిగిననీకు నిది భోగమేసుమ్మీ
అదన శ్రీవేంకటేశ అంటి నిన్ను గెలిచితి
యెదుట నీపెద్దరిక మిదియునుఁ జుమ్మీ
(||pallavi||)
taga ninniḍigi nide daṁḍamu summī
nagidi niṁdām̐ka nībai nanubunam̐ jummī
(||taga||)
anarānimāḍalĕlla nāḍudu ninnĕṁdugainā
munugŏni nīmīm̐di mohamesumī
panivaḍi ninnum̐ gŏṁguvaṭṭidīdu nŏgaveḽa
sanavuna nīvichchinasaligĕlam̐ jummī
(||taga||)
paṁtamuna nīmīm̐da pakkanam̐ jeyi sām̐side
aṁtayunu nīmīm̐di āsalesummī
saṁtamai ninnu bŏmmala jaṁkiṁchi adaliṁtunu
viṁtalaina nīmīm̐diveḍugalĕsummī
(||taga||)
kadisi ninnum̐ gām̐giḍa kaḍubigiṁchide nenu
pŏdiginanīgu nidi bhogamesummī
adana śhrīveṁkaḍeśha aṁṭi ninnu gĕlisidi
yĕduḍa nībĕddariga midiyunum̐ jummī