తగ దిఁకనూ నీ వెటు సేసిన తపములు ఫలియించె
(॥పల్లవి॥)
తగ దిఁకనూ నీ వెటు సేసిన తపములు ఫలియించె
మగవాఁడూ ప్రియములు చెప్పఁగ మంకులు పని లేవే అమ్మా
(॥తగ॥)
అలుగుకువే వోచిలియా ఆతఁడు గరి గాఁడు
వలవంతల నీలోఁ బొడమినవలపులు గురి గాని
చలములు యింకా సాదించకువే జగడము పని లేదు
వెలసిన నీ మొగమోటము లుండఁగ వెనక నేరరాదు
(॥తగ॥)
తడవకువే ఆతఁడు చేసినతప్పులు గురి గావు
విడువక నీతనువునఁ బెనఁగెటివిరహము గురి గాని
చిడుముడికి యిఁక నేఁటికి నీచేతికి లో నతఁడూ
బడిబడినె నీవే అతనికిఁ బంత మియ్యఁ బడును
(॥తగ॥)
పెనగకువే శ్రీవెంకటేశ్వరు బీరము గురి గాదు
కొన మొద లెంచుక మీలోఁ గూడినకూటమి గురి గాని
వినియును వినకే సిగ్గులు వడియెడివెరగులు వని లేదూ
ననిచిన నీసెలవులలో ముసిముసి నవ్వులు దొలఁకఁగను
(||pallavi||)
taga dim̐kanū nī vĕḍu sesina tabamulu phaliyiṁchĕ
magavām̐ḍū priyamulu sĕppam̐ga maṁkulu pani leve ammā
(||taga||)
aluguguve vosiliyā ādam̐ḍu gari gām̐ḍu
valavaṁtala nīlom̐ bŏḍaminavalabulu guri gāni
salamulu yiṁkā sādiṁchaguve jagaḍamu pani ledu
vĕlasina nī mŏgamoḍamu luṁḍam̐ga vĕnaga nerarādu
(||taga||)
taḍavaguve ādam̐ḍu sesinadappulu guri gāvu
viḍuvaga nīdanuvunam̐ bĕnam̐gĕḍivirahamu guri gāni
siḍumuḍigi yim̐ka nem̐ṭigi nīsedigi lo nadam̐ḍū
baḍibaḍinĕ nīve adanigim̐ baṁta miyyam̐ baḍunu
(||taga||)
pĕnagaguve śhrīvĕṁkaḍeśhvaru bīramu guri gādu
kŏna mŏda lĕṁchuga mīlom̐ gūḍinagūḍami guri gāni
viniyunu vinage siggulu vaḍiyĕḍivĕragulu vani ledū
nanisina nīsĕlavulalo musimusi navvulu dŏlam̐kam̐ganu