Tadivachche nimka dayadalamsaraadaa

తతివచ్చె నిఁక దయదలఁచరాదా
Language

(॥పల్లవి॥)
తతివచ్చె నిఁక దయదలఁచరాదా
యితరులవలెఁ జెలి యింత కోపఁగలదా

(॥తతి॥)
కేలుఁ గేలుఁ గీలించి గిలిగించే వాపె నిన్ను
నాలిసేసి సారె సారె నవ్వెనంటాను
మేలములనే యలసె మేనెల్లాఁ జెమరించె
యీలావులు నీవు సూపె వింత కోపఁగలదా

(॥తతి॥)
పయ్యదలోఁ జేయిచాఁచి బలిమిఁ జన్ను లంటేవు
వొయ్యనే ఆపె నీపు నొరగెనంటా
నెయ్యపుఁ జేఁతలఁ జొక్కె నేరుపున నీకు మొక్కె
అయ్యెడ నీతో నూఁకోన నంత నంత కోపఁగలదా

(॥తతి॥)
కాయము నీవే యంటి కాఁగిలించే వాపె నీపై
చాయచేసుకొని చేయి చాఁచెనంటాను
యీయెడ శ్రీవేంకటేశ యెనసి మై పులకించె
యేయెడనైనాఁ జెప్పే వింత కోపఁగలదా

(||pallavi||)
tadivachchĕ nim̐ka dayadalam̐sarādā
yidarulavalĕm̐ jĕli yiṁta kobam̐galadā

(||tadi||)
kelum̐ gelum̐ gīliṁchi giligiṁche vābĕ ninnu
nālisesi sārĕ sārĕ navvĕnaṁṭānu
melamulane yalasĕ menĕllām̐ jĕmariṁchĕ
yīlāvulu nīvu sūbĕ viṁta kobam̐galadā

(||tadi||)
payyadalom̐ jeyisām̐si balimim̐ jannu laṁṭevu
vŏyyane ābĕ nību nŏragĕnaṁṭā
nĕyyabum̐ jem̐talam̐ jŏkkĕ nerubuna nīgu mŏkkĕ
ayyĕḍa nīdo nūm̐kona naṁta naṁta kobam̐galadā

(||tadi||)
kāyamu nīve yaṁṭi kām̐giliṁche vābĕ nībai
sāyasesugŏni seyi sām̐sĕnaṁṭānu
yīyĕḍa śhrīveṁkaḍeśha yĕnasi mai pulagiṁchĕ
yeyĕḍanainām̐ jĕppe viṁta kobam̐galadā