Tadigoni yemaṟaga talamsamgavalem gaaga

తతిగొని యేమఱక తలఁచఁగవలెఁ గాక
Language

(॥పల్లవి॥)
తతిగొని యేమఱక తలఁచఁగవలెఁ గాక
హితవై నీ నామమున్న దిఁక నేల చింతా

(॥తతి॥)
దప్పిగొన్నవానికి శీతలోదకమువలె
కప్పి పతివ్రతకు మంగళసూత్రమువలె
ముప్పిరి దరిద్రునకు ముంగిటిధనమువలె
నెప్పుడు నీ నామ మున్న దిఁక నేల చింతా

(॥తతి॥)
నలిరేఁగి విషదగ్ధునకు నిర్విషమువలె
యిల నెండ దాఁకినదేహికి మంచి నీడవలె
చెలఁగి జాత్యంధునికి సిద్ధాంజనమువలె
నెలమి నీ నామ మున్న దిఁక నేల చింతా

(॥తతి॥)
పట్టభద్రునోరికి గప్రఁపుఁబలుకువలె
గుట్టునఁ దండ్రికి ముద్దుఁగొడుకువలె
గట్టిగా శ్రీవేంకటేశ కడఁగి నా నాలికెకు
యిట్టే నీ నామ మున్న దిఁక నేల చింతా

(||pallavi||)
tadigŏni yemaṟaga talam̐sam̐gavalĕm̐ gāga
hidavai nī nāmamunna dim̐ka nela siṁtā

(||tadi||)
dappigŏnnavānigi śhīdalodagamuvalĕ
kappi padivradagu maṁgaḽasūtramuvalĕ
muppiri daridrunagu muṁgiḍidhanamuvalĕ
nĕppuḍu nī nāma munna dim̐ka nela siṁtā

(||tadi||)
nalirem̐gi viṣhadagdhunagu nirviṣhamuvalĕ
yila nĕṁḍa dām̐kinadehigi maṁchi nīḍavalĕ
sĕlam̐gi jātyaṁdhunigi siddhāṁjanamuvalĕ
nĕlami nī nāma munna dim̐ka nela siṁtā

(||tadi||)
paṭṭabhadrunorigi gapram̐pum̐baluguvalĕ
guṭṭunam̐ daṁḍrigi muddum̐gŏḍuguvalĕ
gaṭṭigā śhrīveṁkaḍeśha kaḍam̐gi nā nāligĕgu
yiṭṭe nī nāma munna dim̐ka nela siṁtā