Tadigaadu imka nave tadavaraadu

తతిగాదు ఇఁక నవె తడవరాదు
Language

(॥పల్లవి॥)
తతిగాదు ఇఁక నవె తడవరాదు
సతమాయఁ బనులెల్ల చక్కనాయ నిపుడు

(॥తతి॥)
అప్పటికోపాన నంటి ఆతఁ డీడకు విచ్చేసె
చెప్పికురే ఆసుద్దులు చెలులాల
కొప్పు నాకు నిదె జారె కోపము నంతటఁబోయ
కప్పియాతఁ డిట్టె నన్ను గక్కన మన్నించెను

(॥తతి॥)
మొక్కలానఁ బొమ్మంటి మొగమోడె నాకాతఁడు
దక్కి నావద్ద నుండరే తరుణులాల
చెక్కులెల్లాఁ జెమరించె చింతలూ నంతటఁ దీరె
తక్కక యాతఁడే నాకు తానె బాస యిచ్చెను

(॥తతి॥)
ఆసలఁ గన్ను గీఁటితి నంతలో నాతఁడు గూడె
వాసితో నూరకుండరే వనితలాలా
సేసలు కొప్పున నిండె చేసినసేఁతలు చెల్లె
యీసుదీర శ్రీవేంకటేశుఁడు లోనాయను

(||pallavi||)
tadigādu im̐ka navĕ taḍavarādu
sadamāyam̐ banulĕlla sakkanāya nibuḍu

(||tadi||)
appaḍigobāna naṁṭi ādam̐ ḍīḍagu vichchesĕ
sĕppigure āsuddulu sĕlulāla
kŏppu nāgu nidĕ jārĕ kobamu naṁtaḍam̐boya
kappiyādam̐ ḍiṭṭĕ nannu gakkana manniṁchĕnu

(||tadi||)
mŏkkalānam̐ bŏmmaṁṭi mŏgamoḍĕ nāgādam̐ḍu
dakki nāvadda nuṁḍare taruṇulāla
sĕkkulĕllām̐ jĕmariṁchĕ siṁtalū naṁtaḍam̐ dīrĕ
takkaga yādam̐ḍe nāgu tānĕ bāsa yichchĕnu

(||tadi||)
āsalam̐ gannu gīm̐ṭidi naṁtalo nādam̐ḍu gūḍĕ
vāsido nūraguṁḍare vanidalālā
sesalu kŏppuna niṁḍĕ sesinasem̐talu sĕllĕ
yīsudīra śhrīveṁkaḍeśhum̐ḍu lonāyanu