తతి గాని తతి నేల తమకించేరే
(॥పల్లవి॥)
తతి గాని తతి నేల తమకించేరే
మతిలోని నొప్పి గొంత మాన నియ్యరే
(॥తతి గాని॥)
పతిఁ బాసి వున్న దాన బలు విరహపువేళ
యిత వంటా విరులు నా కేల యిచ్చేరే
రతిరాజనమ్ము లివి రంట దెప్పరపువేళ
కతుకున నాఁటుఁ జేసు గవిశన నిడరే
(॥తతి గాని॥)
కందువ జవ్వనమునఁ గావరించి వున్నవేళ
యింద మంటా గందము నా కేల పూసేరే
మందమారుతాన కవి మచ్చు చల్లే చొక్కుమందు
యిందు కేల పెట్టెఁ గట్టి యింటిలోన నిడరే
(॥తతిగాని॥)
శ్రీవెంకటేశువొద్ద సిగ్గువడి వున్న దాన
చేవ దేర నిప్పు డేమి సింగారించేరే
యీవల నాతఁడు గూడె యీ సొమ్ము లిన్నియును
వేవే లాతఁ డిచ్చినవె వేగిర పడకురే
(||pallavi||)
tadi gāni tadi nela tamagiṁchere
madiloni nŏppi gŏṁta māna niyyare
(||tadi gāni||)
padim̐ bāsi vunna dāna balu virahabuveḽa
yida vaṁṭā virulu nā kela yichchere
radirājanammu livi raṁṭa dĕpparabuveḽa
kaduguna nām̐ṭum̐ jesu gaviśhana niḍare
(||tadi gāni||)
kaṁduva javvanamunam̐ gāvariṁchi vunnaveḽa
yiṁda maṁṭā gaṁdamu nā kela pūsere
maṁdamārudāna kavi machchu salle sŏkkumaṁdu
yiṁdu kela pĕṭṭĕm̐ gaṭṭi yiṁṭilona niḍare
(||tadigāni||)
śhrīvĕṁkaḍeśhuvŏdda sigguvaḍi vunna dāna
seva dera nippu ḍemi siṁgāriṁchere
yīvala nādam̐ḍu gūḍĕ yī sŏmmu linniyunu
veve lādam̐ ḍichchinavĕ vegira paḍagure