(॥పల్లవి॥)
తడవీ నూరక తగ దనఁడు
బడిబడి రమణుఁడు పయిపై వీడఁడు
(॥తడ॥)
మంతన మొకతెతో మాఁటలాడుతా
బంతికిఁ బిలిచీఁ బతి నగఁడు
సంతత మాకెతో సరసమాడుతాఁ
జెంత నీడె మొసఁగీ సిగ్గువడఁడు
(॥తడ॥)
పానుపున నొకతెపైఁ జెఱఁ గంటుచు
లోనికిఁ బలిచీ లోఁగఁ డిదే
ఆనుకొని యాకెయధరము గ్రోలుచు
మానము దొడికెను మాఁటా వినఁడు
(॥తడ॥)
వురమున నొకసతి నునుచుక కాఁగిట
ధరనుఁ గూడీఁ దడఁబడఁడు
యిరవుగ శ్రీవేంకటేశుఁ డిద్దరిని
సరిగాఁ గూడెనుఁ జాలూ ననఁడు
(||pallavi||)
taḍavī nūraga taga danam̐ḍu
baḍibaḍi ramaṇum̐ḍu payibai vīḍam̐ḍu
(||taḍa||)
maṁtana mŏgadĕdo mām̐ṭalāḍudā
baṁtigim̐ bilisīm̐ badi nagam̐ḍu
saṁtada māgĕdo sarasamāḍudām̐
jĕṁta nīḍĕ mŏsam̐gī sigguvaḍam̐ḍu
(||taḍa||)
pānubuna nŏgadĕbaim̐ jĕṟam̐ gaṁṭusu
lonigim̐ balisī lom̐gam̐ ḍide
ānugŏni yāgĕyadharamu grolusu
mānamu dŏḍigĕnu mām̐ṭā vinam̐ḍu
(||taḍa||)
vuramuna nŏgasadi nunusuga kām̐giḍa
dharanum̐ gūḍīm̐ daḍam̐baḍam̐ḍu
yiravuga śhrīveṁkaḍeśhum̐ ḍiddarini
sarigām̐ gūḍĕnum̐ jālū nanam̐ḍu