తడవము తాఁకము తానే చెనకీ నన్ను
(॥పల్లవి॥)
తడవము తాఁకము తానే చెనకీ నన్ను
కడఁగి యీతని లాగు కంటివటే చెలియ
(॥తడ॥)
పొరిఁబొరి వనములో పూవులు నేఁగోయఁ గాను
సరసము లేమాడీనే జాజరకాఁడు
సరస నే నింతులతో జలకేలి సేయఁగాను
దరినుం డేమినవ్వీనే తచ్చనకాఁడు
(॥తడ॥)
మేడలోనుండి జవ్వాది మేఁ బూసుకొనఁగాను
వీడె మేవియ్య వచ్చీనే వేడుకకాఁడు
నీడ చూచి కస్తూరిని నే బొట్టు వెట్టుకోఁగాను
వోడక యెంత మెచ్చీనే వుబ్బరికాఁడు
(॥తడ॥)
యెన్నికతోఁ గిన్దెర వాయించుకొంటా నే నుండఁగా
చన్నులేల చూచీనే జాణకాఁడు
ఇన్నిటా శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్నుఁ గూడె
కన్ను లెంత జంకించీనే గద్దరి కాఁడు
(||pallavi||)
taḍavamu tām̐kamu tāne sĕnagī nannu
kaḍam̐gi yīdani lāgu kaṁṭivaḍe sĕliya
(||taḍa||)
pŏrim̐bŏri vanamulo pūvulu nem̐goyam̐ gānu
sarasamu lemāḍīne jājaragām̐ḍu
sarasa ne niṁtulado jalageli seyam̐gānu
darinuṁ ḍeminavvīne tachchanagām̐ḍu
(||taḍa||)
meḍalonuṁḍi javvādi mem̐ būsugŏnam̐gānu
vīḍĕ meviyya vachchīne veḍugagām̐ḍu
nīḍa sūsi kastūrini ne bŏṭṭu vĕṭṭugom̐gānu
voḍaga yĕṁta mĕchchīne vubbarigām̐ḍu
(||taḍa||)
yĕnnigadom̐ gindĕra vāyiṁchugŏṁṭā ne nuṁḍam̐gā
sannulela sūsīne jāṇagām̐ḍu
inniḍā śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannum̐ gūḍĕ
kannu lĕṁta jaṁkiṁchīne gaddari kām̐ḍu