(॥పల్లవి॥)
తడవకు మము నటు తలవయ్యా
పిడికెడు నడుములఁ బెనఁగేమయ్యా
(॥తడ॥)
పంతము మాతోఁ బలుకఁగఁ బలుకఁగ
దొంతులు బెదరీఁ దొలవయ్యా
కాంతల మింతే కన్నులు పెద్దని
బంతులఁ జూపిటు బతికేమయ్యా
(॥తడ॥)
అంచె జాణతన మటు నీవాడఁగ
మంచము ములిగీ మానవయ్యా
కొంచపుమోమున గురిగా కళలే
నించుక మెరసే నెలతలమయ్యా
(॥తడ॥)
కాఁగిటి కొయ్యనె కదియఁగఁ గదియఁగ
వాఁగీ నందెలు వద్దయ్యా
ఆఁగుచు శ్రీవేంకటాధిప కూడితి
మాఁగినరతి మెయి మఱచేమయ్యా
(||pallavi||)
taḍavagu mamu naḍu talavayyā
piḍigĕḍu naḍumulam̐ bĕnam̐gemayyā
(||taḍa||)
paṁtamu mādom̐ balugam̐gam̐ balugam̐ga
dŏṁtulu bĕdarīm̐ dŏlavayyā
kāṁtala miṁte kannulu pĕddani
baṁtulam̐ jūbiḍu badigemayyā
(||taḍa||)
aṁchĕ jāṇadana maḍu nīvāḍam̐ga
maṁchamu muligī mānavayyā
kŏṁchabumomuna gurigā kaḽale
niṁchuga mĕrase nĕladalamayyā
(||taḍa||)
kām̐giḍi kŏyyanĕ kadiyam̐gam̐ gadiyam̐ga
vām̐gī naṁdĕlu vaddayyā
ām̐gusu śhrīveṁkaḍādhiba kūḍidi
mām̐ginaradi mĕyi maṟasemayyā