Tadavaaya neevaddigi taane vachchuno yemo

తడవాయ నీవద్దికి తానే వచ్చునో యేమో
Language

(॥పల్లవి॥)
తడవాయ నీవద్దికి తానే వచ్చునో యేమో
యెడయక నీవునీవే యెరుఁగుదువయ్యా

(॥॥)
విందువలె నాకెమాఁట విన్నవించితిమి నీకు
అందుకు మారుమాఁట లానతీవయ్యా
సందడికోలువు నీకు సతులెందరో కలరు
మందలిం చాకెకిచ్చినమాఁట దలఁ చవయ్యా

(॥॥)
గక్కన నాపెయంపినకాను కిచ్చితిమి నీకు
యిక్కువైన ఆనవాలు యియ్యివయ్యా
పెక్కుపనులవాఁడవు ప్రేమ నీ కెందునుండునో
యెక్కువ నీచుట్టరిక మెంచుకొనవయ్యా

(॥॥)
చెలఁగి యాకెమారు చేయెత్తి మొక్కితిమి
తిలకించి నీవిందుకు దీవించవయ్యా
యెలమి శ్రీ వేంకటేశ యిట్టెవచ్చి కూడితివి
మలసి యీననుపులు మరువకువయ్యా

(||pallavi||)
taḍavāya nīvaddigi tāne vachchuno yemo
yĕḍayaga nīvunīve yĕrum̐guduvayyā

(||||)
viṁduvalĕ nāgĕmām̐ṭa vinnaviṁchidimi nīgu
aṁdugu mārumām̐ṭa lānadīvayyā
saṁdaḍigoluvu nīgu sadulĕṁdaro kalaru
maṁdaliṁ sāgĕgichchinamām̐ṭa dalam̐ savayyā

(||||)
gakkana nābĕyaṁpinagānu kichchidimi nīgu
yikkuvaina ānavālu yiyyivayyā
pĕkkubanulavām̐ḍavu prema nī kĕṁdunuṁḍuno
yĕkkuva nīsuṭṭariga mĕṁchugŏnavayyā

(||||)
sĕlam̐gi yāgĕmāru seyĕtti mŏkkidimi
tilagiṁchi nīviṁdugu dīviṁchavayyā
yĕlami śhrī veṁkaḍeśha yiṭṭĕvachchi kūḍidivi
malasi yīnanubulu maruvaguvayyā