Tadambadee mee sommulu taarumaarai yiddarigee

తడఁబడీ మీ సొమ్ములు తారుమారై యిద్దరికీ
Language

(॥పల్లవి॥)
తడఁబడీ మీ సొమ్ములు తారుమారై యిద్దరికీ
అడియాలా లివి చూచి అరుదయ్యీ మాకు

(॥॥)
మెలఁత గుబ్బలమీఁద మించె నీలాల హారము
తలకొని నీ వెప్పుడూ ధరించే దిదా
వెలలేని మాణికాల వింత యైన వుంగరము
అల నీ వేల నున్నది ఆపె నీ కొసగెనా

(॥॥)
మగువ పాదమున బొమ్మల పెండె మున్నది
నిగ నిగ మనీ నదే నీ విచ్చినదా
మొగపుల బాహుపురి ముంజేత నీ కున్నది
అగపడీ గుఱుతుగా నాపె నీకుఁ బెట్టే నా

(॥॥)
అలమేల్మంగకు నీకు నమరెను మొలనూళ్ళు
మలసి మీరిద్దరును మార్చుకొంటిరా
యెలమి శ్రీ వేంకటేశ యీ చొప్పులు నేఁగంటి
బలిమి నాకెకు నీకుఁ బాయరానిపొందులా

(||pallavi||)
taḍam̐baḍī mī sŏmmulu tārumārai yiddarigī
aḍiyālā livi sūsi arudayyī māgu

(||||)
mĕlam̐ta gubbalamīm̐da miṁchĕ nīlāla hāramu
talagŏni nī vĕppuḍū dhariṁche didā
vĕlaleni māṇigāla viṁta yaina vuṁgaramu
ala nī vela nunnadi ābĕ nī kŏsagĕnā

(||||)
maguva pādamuna bŏmmala pĕṁḍĕ munnadi
niga niga manī nade nī vichchinadā
mŏgabula bāhuburi muṁjeda nī kunnadi
agabaḍī guṟudugā nābĕ nīgum̐ bĕṭṭe nā

(||||)
alamelmaṁgagu nīgu namarĕnu mŏlanūḽḽu
malasi mīriddarunu mārsugŏṁṭirā
yĕlami śhrī veṁkaḍeśha yī sŏppulu nem̐gaṁṭi
balimi nāgĕgu nīgum̐ bāyarānibŏṁdulā