Tadambade naa madi tana kauno naa kauno

తడఁబడె నా మది తన కౌనో నా కౌనో
Language

(॥పల్లవి॥)
తడఁబడె నా మది తన కౌనో నా కౌనో
చిడిముడి నాతనికిఁ జెప్పరే యీ కతలు

(॥॥)
పెనగొని మాటలాడఁ బెదవులు వేగిరించీ
తన చిత్త మెట్టున్నదో తలఁచరాదు
కనుఁగొనలఁ దనుఁ జక్కఁగఁ జూడకుండరాదు
వొనర నెంత నాఁటునో వోరువరాదు

(॥॥)
కాయము తోడి లంకెలు కరములఁ దొట్టు కొనీ
ఆ యెడ నెం తలసునో అదియుఁగాదు
పాయపు మదము గుబ్బలు తన పొందు గోరీ
ఆయము లేడ సోఁకునో అంత కోప రాదు

(॥॥)
జవ్వనానఁ గల సిగ్గు సమరతు లాసపడీ
నవ్వు లెట్టున్నవో నాతోఁ దనకు
యివ్వల శ్రీ వేంకటేశుఁడేలె నన్ను మెచ్చితే
రవ్వ లెంతౌనో యీరతి చెప్పరాదూ

(||pallavi||)
taḍam̐baḍĕ nā madi tana kauno nā kauno
siḍimuḍi nādanigim̐ jĕppare yī kadalu

(||||)
pĕnagŏni māḍalāḍam̐ bĕdavulu vegiriṁchī
tana sitta mĕṭṭunnado talam̐sarādu
kanum̐gŏnalam̐ danum̐ jakkam̐gam̐ jūḍaguṁḍarādu
vŏnara nĕṁta nām̐ṭuno voruvarādu

(||||)
kāyamu toḍi laṁkĕlu karamulam̐ dŏṭṭu kŏnī
ā yĕḍa nĕṁ talasuno adiyum̐gādu
pāyabu madamu gubbalu tana pŏṁdu gorī
āyamu leḍa som̐kuno aṁta koba rādu

(||||)
javvanānam̐ gala siggu samaradu lāsabaḍī
navvu lĕṭṭunnavo nādom̐ danagu
yivvala śhrī veṁkaḍeśhum̐ḍelĕ nannu mĕchchide
ravva lĕṁtauno yīradi sĕpparādū