తడఁబాట్లాయఁ బని తప్పులోరుచుకోవయ్య
(॥పల్లవి॥)
తడఁబాట్లాయఁ బని తప్పులోరుచుకోవయ్య
అడరి నా సొమ్మవు నీవంటా నేనుంటిని
(॥తడఁ॥)
వొలిసి యెవ్వతెనో నీ వూరకే చింతించఁగాను
మలసి నడుమ నేను మాటాడించితి
కులికి నీ చిత్తానకు కోపముగాదుగదా
అలరి నాకే వలతువంటా నేనుంటిని
(॥తడఁ॥)
పట్టి యెవ్వతో చన్నులపైఁ బరాకై నీవుండఁగ
గుట్టున నుండక నిన్నుఁ గొంగువట్టితి
వెట్టియైన నీభోగానకు వేసటగాదుగదా
నట్టుకొన్న నీచేఁతలు నాకంటా నేనుంటిని
(॥తడఁ॥)
సొరిది నెవ్వతెపైనో చూపువెట్టుకుండఁగాను
గరిమ నిన్నుఁ గాఁగిఁటఁ గలసితిని
అరుదై శ్రీ వేంకటేశ అంకెవచ్చెనా నీకు
పరువపునీమాటపట్టు నమ్మివుంటిని
(||pallavi||)
taḍam̐bāṭlāyam̐ bani tappulorusugovayya
aḍari nā sŏmmavu nīvaṁṭā nenuṁṭini
(||taḍam̐||)
vŏlisi yĕvvadĕno nī vūrage siṁtiṁcham̐gānu
malasi naḍuma nenu māḍāḍiṁchidi
kuligi nī sittānagu kobamugādugadā
alari nāge valaduvaṁṭā nenuṁṭini
(||taḍam̐||)
paṭṭi yĕvvado sannulabaim̐ barāgai nīvuṁḍam̐ga
guṭṭuna nuṁḍaga ninnum̐ gŏṁguvaṭṭidi
vĕṭṭiyaina nībhogānagu vesaḍagādugadā
naṭṭugŏnna nīsem̐talu nāgaṁṭā nenuṁṭini
(||taḍam̐||)
sŏridi nĕvvadĕbaino sūbuvĕṭṭuguṁḍam̐gānu
garima ninnum̐ gām̐gim̐ṭam̐ galasidini
arudai śhrī veṁkaḍeśha aṁkĕvachchĕnā nīgu
paruvabunīmāḍabaṭṭu nammivuṁṭini