Tabamula badalamga tama kela munulagu

తపముల బడలఁగ తమ కేల మునులకు
Language

(॥పల్లవి॥)
తపముల బడలఁగ తమ కేల మునులకు
నెప మిదె సాధించ నియ్యెడకు నింకను

(॥తప॥)
అడుకులు వెట్టి నీచే నందెను సిరు లొకఁడు
కడు గంపఁ గమ్మి దాఁచి కైవల్య మందె నొకఁడు
కుడువఁ గూడు దెచ్చి కొందరు నీ వారైరి
వడి నిట్టే యణకించవచ్చుఁబో నిన్నింకను

(॥తప॥)
నీ తల పువ్వులు చుట్టి నిత్యుఁ డాయె నొకఁడు
కాతరాన గంద మిచ్చి కలసె నిన్నొక తె
చేత బలుసాకు వెట్టి సిరులు గనె నొకఁడు
యీతల నిన్ను చెల్లించే దేమి దొడ్డ యింకను

(॥తప॥)
మంద గోపికల కడ మాటాడి మించె నొకఁడు
కందువ నీకు దాసుఁడై కరుణఁ బొందె నొకఁడు
యిందరు వరము లందిరిదె శ్రీ వేంకటేశుఁడ
సందడి నిన్ను సేవించే సర విదె యింకను

(||pallavi||)
tabamula baḍalam̐ga tama kela munulagu
nĕba midĕ sādhiṁcha niyyĕḍagu niṁkanu

(||taba||)
aḍugulu vĕṭṭi nīse naṁdĕnu siru lŏgam̐ḍu
kaḍu gaṁpam̐ gammi dām̐si kaivalya maṁdĕ nŏgam̐ḍu
kuḍuvam̐ gūḍu dĕchchi kŏṁdaru nī vārairi
vaḍi niṭṭe yaṇagiṁchavachchum̐bo ninniṁkanu

(||taba||)
nī tala puvvulu suṭṭi nityum̐ ḍāyĕ nŏgam̐ḍu
kādarāna gaṁda michchi kalasĕ ninnŏga tĕ
seda balusāgu vĕṭṭi sirulu ganĕ nŏgam̐ḍu
yīdala ninnu sĕlliṁche demi dŏḍḍa yiṁkanu

(||taba||)
maṁda gobigala kaḍa māḍāḍi miṁchĕ nŏgam̐ḍu
kaṁduva nīgu dāsum̐ḍai karuṇam̐ bŏṁdĕ nŏgam̐ḍu
yiṁdaru varamu laṁdiridĕ śhrī veṁkaḍeśhum̐ḍa
saṁdaḍi ninnu seviṁche sara vidĕ yiṁkanu