Taarumaaru valabula daayagaamdaa

తారుమారు వలపుల దాయగాఁడా
Language

(॥పల్లవి॥)
తారుమారు వలపుల దాయగాఁడా
యీరీతి నూరకున్నాఁడ వెంత దూరినాను

(॥తారు॥)
కాంత నీకు నొసఁగిన కానికె పువ్వులబంతి
చెంత నీపొరుగాపెచేత నున్నది
వంతుకు నా పెచేతి వైడూర్యపుంగరము
యింతి కిచ్చితివి నిన్ను నేమనేది యిఁకను

(॥తారు॥)
మగువ నీకు నంపిన మంచివాసనజవ్వాది
జిగి నీకొలువలేమచెవి నున్నది
తగునంటా నాపెపాదముల నున్న పెండెము
పగటున నీపె కిచ్చి పచ్చిగా నవ్వేవు

(॥తాకె॥)
చెలి నీయింటఁ బెట్టినచిత్తరు వాతపటము
కొలఁదితో నాపెమునిగోడ నున్నది
కలికి కాఁగిట నీకుఁ గప్పినపయ్యదకొంగు
కలయ శ్రీవేంకటేశ కప్పితివి సతికి

(||pallavi||)
tārumāru valabula dāyagām̐ḍā
yīrīdi nūragunnām̐ḍa vĕṁta dūrinānu

(||tāru||)
kāṁta nīgu nŏsam̐gina kānigĕ puvvulabaṁti
sĕṁta nībŏrugābĕseda nunnadi
vaṁtugu nā pĕsedi vaiḍūryabuṁgaramu
yiṁti kichchidivi ninnu nemanedi yim̐kanu

(||tāru||)
maguva nīgu naṁpina maṁchivāsanajavvādi
jigi nīgŏluvalemasĕvi nunnadi
tagunaṁṭā nābĕbādamula nunna pĕṁḍĕmu
pagaḍuna nībĕ kichchi pachchigā navvevu

(||tāgĕ||)
sĕli nīyiṁṭam̐ bĕṭṭinasittaru vādabaḍamu
kŏlam̐dido nābĕmunigoḍa nunnadi
kaligi kām̐giḍa nīgum̐ gappinabayyadagŏṁgu
kalaya śhrīveṁkaḍeśha kappidivi sadigi