Taarugaanimchugovayya taruni toduda neevu

తారుకాణించుకోవయ్య తరుణి తోడుత నీవు
Language

(॥పల్లవి॥)
తారుకాణించుకోవయ్య తరుణి తోడుత నీవు
నేరమిగా దందుకేమి నీ విన్నిటా జాణవు

(॥తారు॥)
పమ్మి యాపెతో నీవు పక్కన నవ్వితివంటా
కొమ్మ చెలులతో నాడుకొంటా నున్నది
సమ్మతించి యాపె నీతో సన్నలుసేసీ(సే?) నంటా
ఇమ్ములఁ దనలోనే వూహించుకొంటానున్నది

(॥తారు॥)
నిక్కి చూచి వుంగరము నీ వాపె కిచ్చితివంటా
పక్కన నట్టే మచ్చెము పట్టుకున్నది
అక్కడనే విడెము నీ కాపె వొసగినదంటా
ముక్కుపై వేలిడుకొని మోనమున నున్నది

(॥తారు॥)
చాపలాన నాపె మోవి చవి నీవు గొంటివంటా
ఆపనులకే నివ్వెరగై వున్నది
యేపున శ్రీవేంకటేశ యీకె నిట్టె యేలితివి
ఆపె నీకు దేవులంటా నాదరించుకున్నది

(||pallavi||)
tārugāṇiṁchugovayya taruṇi toḍuda nīvu
neramigā daṁdugemi nī vinniḍā jāṇavu

(||tāru||)
pammi yābĕdo nīvu pakkana navvidivaṁṭā
kŏmma sĕlulado nāḍugŏṁṭā nunnadi
sammadiṁchi yābĕ nīdo sannalusesī(se?) naṁṭā
immulam̐ danalone vūhiṁchugŏṁṭānunnadi

(||tāru||)
nikki sūsi vuṁgaramu nī vābĕ kichchidivaṁṭā
pakkana naṭṭe machchĕmu paṭṭugunnadi
akkaḍane viḍĕmu nī kābĕ vŏsaginadaṁṭā
mukkubai veliḍugŏni monamuna nunnadi

(||tāru||)
sābalāna nābĕ movi savi nīvu gŏṁṭivaṁṭā
ābanulage nivvĕragai vunnadi
yebuna śhrīveṁkaḍeśha yīgĕ niṭṭĕ yelidivi
ābĕ nīgu devulaṁṭā nādariṁchugunnadi