తారుకాణించఁగ నేల తతిగొని నాతోను
(॥పల్లవి॥)
తారుకాణించఁగ నేల తతిగొని నాతోను
నేరిచి బదుకనీవే నిజమరైతేను
(॥తారు॥)
వెఱచి తనకు నాపె విన్నవించకుండితేను
తఱి నింతులలో మాట తానెఱుఁగునా
గుణిమె లెల్లాఁ గట్టుకొనీవే తా నా పెవల్ల
చెఱఁగు వట్టందరికి సేవ సేసేదానను
(॥తారు॥)
ఆతల మతకమువ నాపెఁ దను నంపకుంటే
సూతకమైనయట్టి సుద్దెరుఁగునా
గాతల తమపొందులు కవెల వాసుకొనీవే
జాతిగా తమకే నేను సాకిరయ్యే దానను
(॥తారు॥)
గక్కన నాపె తనచే కాఁగిలింపించుకొంటేను
ఇక్కువ లాఁడువారివి యివెరుఁగునా
చిక్కి శ్రీవేంకటేశుఁడు చేరి నన్ను నేఁడు గూడె
నిక్కముఁ దనకు నేఁ బనికివచ్చేదానను
(||pallavi||)
tārugāṇiṁcham̐ga nela tadigŏni nādonu
nerisi baduganīve nijamaraidenu
(||tāru||)
vĕṟasi tanagu nābĕ vinnaviṁchaguṁḍidenu
taṟi niṁtulalo māḍa tānĕṟum̐gunā
guṇimĕ lĕllām̐ gaṭṭugŏnīve tā nā pĕvalla
sĕṟam̐gu vaṭṭaṁdarigi seva sesedānanu
(||tāru||)
ādala madagamuva nābĕm̐ danu naṁpaguṁṭe
sūdagamainayaṭṭi suddĕrum̐gunā
gādala tamabŏṁdulu kavĕla vāsugŏnīve
jādigā tamage nenu sāgirayye dānanu
(||tāru||)
gakkana nābĕ tanase kām̐giliṁpiṁchugŏṁṭenu
ikkuva lām̐ḍuvārivi yivĕrum̐gunā
sikki śhrīveṁkaḍeśhum̐ḍu seri nannu nem̐ḍu gūḍĕ
nikkamum̐ danagu nem̐ banigivachchedānanu