(॥పల్లవి॥)
తారుకాణలై యుండఁగ దాఁచనేల
కూరిమెల్ల నీమీఁద గుంపులైనయట్లు
(॥తారు॥)
కలువ పువ్వుల బంతి కన్నులనదుముకొని
బలువుగ నిన్ను వేసెఁ బడఁతి యిదె
సొలసి తాఁజూచినట్టి చూపులు నీకుఁ దెలిపి
సళుపు మరునమ్ములు సాక్షివెట్టినట్లు
(॥తారు॥)
తుంచి తమలపాకుల తొడమెలు నీమీఁద
ఇంచుకించుకె వేసెనిందరుఁ జూడ
ముంచి చిగురుమోవినీమోవి మోఁపెనని చెప్పి
పొంచి వసంతుని నీకుఁ బూఁటవెట్టినట్లు
(॥తారు॥)
మొగలిరేకుల లేఁతముంటికొన నీమేను
వగగా రేకలు దీసె వంకలుగాను
తగు శ్రీ వేంకటేశుఁడ తరుణి దనపెండ్లికి
మొగిఁ జందురులనెల్ల మూఁకగూర్చినట్లు
(||pallavi||)
tārugāṇalai yuṁḍam̐ga dām̐sanela
kūrimĕlla nīmīm̐da guṁpulainayaṭlu
(||tāru||)
kaluva puvvula baṁti kannulanadumugŏni
baluvuga ninnu vesĕm̐ baḍam̐ti yidĕ
sŏlasi tām̐jūsinaṭṭi sūbulu nīgum̐ dĕlibi
saḽubu marunammulu sākṣhivĕṭṭinaṭlu
(||tāru||)
tuṁchi tamalabāgula tŏḍamĕlu nīmīm̐da
iṁchugiṁchugĕ vesĕniṁdarum̐ jūḍa
muṁchi sigurumovinīmovi mom̐pĕnani sĕppi
pŏṁchi vasaṁtuni nīgum̐ būm̐ṭavĕṭṭinaṭlu
(||tāru||)
mŏgaliregula lem̐tamuṁṭigŏna nīmenu
vagagā regalu dīsĕ vaṁkalugānu
tagu śhrī veṁkaḍeśhum̐ḍa taruṇi danabĕṁḍligi
mŏgim̐ jaṁdurulanĕlla mūm̐kagūrsinaṭlu