Taarugaana vachchenaa talamsugo naamaamta

తారుకాణ వచ్చెనా తలఁచుకో నామాఁట
Language

(॥పల్లవి॥)
తారుకాణ వచ్చెనా తలఁచుకో నామాఁట
గారాబు టలమేల్మంగ కాఁగిటిలోవాఁడవు

(॥తారు॥)
అప్పుడే చెప్పితిఁగా నీ వాపె మోము చూచితేనే
దెప్పరపు వలపుల దేలించునని
ముప్పిరి నది యంతటి మొగమాయ మందులాఁడి
విప్పుచు నీతో విన్నవించరాదుగాక

(॥తారు॥)
పందెము వేసితిఁగా యేపాటిమాఁట నీ వాడినా
యిందుముఖి నిన్ను బయలీఁదించునని
యిందరిలో తొల్లె యది యెంత యెలయింపులాఁడి
చెంది యివి వెల్లవిరి సేయరాదుగాక

(॥తారు॥)
సాకిరి వెట్టితిఁగా యచ్చట నవ్వితేఁ దాను
చేకొని శ్రీవేంకటేశ చెనకునని
యీకడ నన్నేలితి విది యెంత చేఁతలాఁడి
జోకతోడది నీగుట్టు చూపరాదుగాక

(||pallavi||)
tārugāṇa vachchĕnā talam̐sugo nāmām̐ṭa
gārābu ṭalamelmaṁga kām̐giḍilovām̐ḍavu

(||tāru||)
appuḍe sĕppidim̐gā nī vābĕ momu sūsidene
dĕpparabu valabula deliṁchunani
muppiri nadi yaṁtaḍi mŏgamāya maṁdulām̐ḍi
vippusu nīdo vinnaviṁcharādugāga

(||tāru||)
paṁdĕmu vesidim̐gā yebāḍimām̐ṭa nī vāḍinā
yiṁdumukhi ninnu bayalīm̐diṁchunani
yiṁdarilo tŏllĕ yadi yĕṁta yĕlayiṁpulām̐ḍi
sĕṁdi yivi vĕllaviri seyarādugāga

(||tāru||)
sāgiri vĕṭṭidim̐gā yachchaḍa navvidem̐ dānu
segŏni śhrīveṁkaḍeśha sĕnagunani
yīgaḍa nannelidi vidi yĕṁta sem̐talām̐ḍi
jogadoḍadi nīguṭṭu sūbarādugāga