తారుకాణ సేసుకొంటే తానే నేను
(॥పల్లవి॥)
తారుకాణ సేసుకొంటే తానే నేను
యీ రీతినే నవ్వుఁగానీ ఇంటికి రమ్మనవే
(॥॥)
చెక్కులివె చెమరించె చిత్తమెల్లాఁ జిగిరించె
కుక్కినట్టు కోరికలు కొనసాగెను
తొక్కినాఁడు నాపాదము తొలుతే సందడిలోన
యెక్కడ పరాకు సేసి నింటికి రమ్మనవే
(॥॥)
దప్పిదేరె పెదవుల తమకము దైవారె
కొప్పు వీడి చన్నులపై కుప్పలాయను
ముప్పిరిఁగా గట్టినాఁడు ముంజేత కంకణము
యిప్పుడేల నించీ సిగ్గులు యింటికి రమ్మనవే
(॥॥)
ఆయాలంటి నన్నుఁ గూడె అంగమెల్లాఁ బులకించె
చేయి చేయి సోఁకి యాస చిమ్మిరేఁగెను
చాయలా సన్నలా సేస చల్లె శ్రీ వేంకటేశుఁడు
యీయెడ నన్ను మన్నీంచీ యింటికి రమ్మనవే
(||pallavi||)
tārugāṇa sesugŏṁṭe tāne nenu
yī rīdine navvum̐gānī iṁṭigi rammanave
(||||)
sĕkkulivĕ sĕmariṁchĕ sittamĕllām̐ jigiriṁchĕ
kukkinaṭṭu korigalu kŏnasāgĕnu
tŏkkinām̐ḍu nābādamu tŏlude saṁdaḍilona
yĕkkaḍa parāgu sesi niṁṭigi rammanave
(||||)
dappiderĕ pĕdavula tamagamu daivārĕ
kŏppu vīḍi sannulabai kuppalāyanu
muppirim̐gā gaṭṭinām̐ḍu muṁjeda kaṁkaṇamu
yippuḍela niṁchī siggulu yiṁṭigi rammanave
(||||)
āyālaṁṭi nannum̐ gūḍĕ aṁgamĕllām̐ bulagiṁchĕ
seyi seyi som̐ki yāsa simmirem̐gĕnu
sāyalā sannalā sesa sallĕ śhrī veṁkaḍeśhum̐ḍu
yīyĕḍa nannu mannīṁchī yiṁṭigi rammanave