Taarugaana nivi itte tappadu gaaga

తారుకాణ నివి ఇట్టె తప్పదు గాక
Language

(॥పల్లవి॥)
తారుకాణ నివి ఇట్టె తప్పదు గాక
తారి తారి తమకానఁ దమకించేఁ గాక

(॥తారు॥)
తరుణి విలువఁబోయి తానుసించి రాదాయ
వరుసెరిఁగి నాపతి వచ్చీనో కాక
అరిది నాయెడమక న్నదరీ నేఁ డిపు డిట్టె
సారిది నాప్రాణేశుఁ జూచేనో కాక

(॥తారు॥)
మక్కువఁ బతిఁ దలఁచి మర్మములు గలఁగె నే-
నక్కడఁ బతికిఁ దలైఁతినో కాక
ఇక్కువైనదంతపుటింటిలోనే చప్పుడయ్యీ
వుక్కుమీరి యీడనే తా నున్నాఁడోకాక

(॥తారు॥)
పరగఁ బరవుపై నాపతి కాఁగిటిలోఁ గూడె
గరిమ నిందాఁక కలగంటినో కాక
యిరవై శ్రీవేంకటేశుఁ డితఁ డెంతమాయలాఁడు
సరసములే నాతో జరపెనో కాక

(||pallavi||)
tārugāṇa nivi iṭṭĕ tappadu gāga
tāri tāri tamagānam̐ damagiṁchem̐ gāga

(||tāru||)
taruṇi viluvam̐boyi tānusiṁchi rādāya
varusĕrim̐gi nābadi vachchīno kāga
aridi nāyĕḍamaga nnadarī nem̐ ḍibu ḍiṭṭĕ
sāridi nāprāṇeśhum̐ jūseno kāga

(||tāru||)
makkuvam̐ badim̐ dalam̐si marmamulu galam̐gĕ ne-
nakkaḍam̐ badigim̐ dalaim̐tino kāga
ikkuvainadaṁtabuḍiṁṭilone sappuḍayyī
vukkumīri yīḍane tā nunnām̐ḍogāga

(||tāru||)
paragam̐ baravubai nābadi kām̐giḍilom̐ gūḍĕ
garima niṁdām̐ka kalagaṁṭino kāga
yiravai śhrīveṁkaḍeśhum̐ ḍidam̐ ḍĕṁtamāyalām̐ḍu
sarasamule nādo jarabĕno kāga