తాను సేసినట్టి చేఁత తనకుఁ జెల్లెననరే
(॥పల్లవి॥)
తాను సేసినట్టి చేఁత తనకుఁ జెల్లెననరే
ఆనిన తనకిది సందాయననరే
(॥తాను॥)
చిత్తజుఁ డమ్ముల నేసె సిగ్గులు నానోరు మూసె
వొత్తి తన్ను దూరనేరకున్న దాననే
జొత్తుఁగూడెఁ బులకలు సొంపువీడె నలకలు
యెత్తినతనతోఁ బెనఁగ నెఱఁగనైతినే
(॥తాను॥)
చిన్నిగాలి సందు దూరె చెమట నామేనఁ గారె
పన్ని తనకొంగు బిగ్గెఁబట్టనై తినే
కన్నులఁ గెంపుల మూఁగె కమ్మర నామోవి మాఁగె
మున్నిటిచేఁత మరచి మొకమోడితినే
(॥తాను ॥)
చందురుఁడు సుంకుమోఁపె జవ్వనము చిమ్మిరేఁపె
మందలించి నామేను మరచితినే
యిందులో శ్రీవేంకటేశుఁ డిట్టె నన్నుఁ గూడె
అందెను మన్ననరతి కందునే చొక్కితినే
(||pallavi||)
tānu sesinaṭṭi sem̐ta tanagum̐ jĕllĕnanare
ānina tanagidi saṁdāyananare
(||tānu||)
sittajum̐ ḍammula nesĕ siggulu nānoru mūsĕ
vŏtti tannu dūraneragunna dānane
jŏttum̐gūḍĕm̐ bulagalu sŏṁpuvīḍĕ nalagalu
yĕttinadanadom̐ bĕnam̐ga nĕṟam̐ganaidine
(||tānu||)
sinnigāli saṁdu dūrĕ sĕmaḍa nāmenam̐ gārĕ
panni tanagŏṁgu biggĕm̐baṭṭanai tine
kannulam̐ gĕṁpula mūm̐gĕ kammara nāmovi mām̐gĕ
munniḍisem̐ta marasi mŏgamoḍidine
(||tānu ||)
saṁdurum̐ḍu suṁkumom̐pĕ javvanamu simmirem̐pĕ
maṁdaliṁchi nāmenu marasidine
yiṁdulo śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ nannum̐ gūḍĕ
aṁdĕnu mannanaradi kaṁdune sŏkkidine