Taanokkade guri tamagamunagunu

తానొక్కడే గురి తమకమునకును
Language

(॥పల్లవి॥)
తానొక్కడే గురి తమకమునకును
యేనింక నెవ్వరితో నేమిచెప్పేనే

(॥తానొ॥)
తనువొక్కటే గురి తన్నుఁ బాసెకాఁకలకు
మనసొక్కటే గురి మంతనాలకు
కనుఁగొనలే గురి కడునిట్టచూపులకు
యెనసి యెవ్వరి కింక నేమిచెప్పేనే

(॥తానొ॥)
పాయమొక్కటే గుఱి పచ్చివలపులకెల్లా
చేయి చెక్కిటికి గురి చింతలకును
మోయు నిట్టూర్పులు గురి మనుకొన్న కోరికకు
యేయెడ ముచ్చట లింక నేమిచెప్పేనే

(॥తానొ॥)
కూడినకూటములకు కొనగోరొక్కటే గురి
యీడనాకు శ్రేవేంకటేశునికిని
తోడనే కళలు గుఱి తుదలేనివేడుకకు
యేడ నెవ్వరికి నింక నేమి చెప్పేనే

(||pallavi||)
tānŏkkaḍe guri tamagamunagunu
yeniṁka nĕvvarido nemisĕppene

(||tānŏ||)
tanuvŏkkaḍe guri tannum̐ bāsĕgām̐kalagu
manasŏkkaḍe guri maṁtanālagu
kanum̐gŏnale guri kaḍuniṭṭasūbulagu
yĕnasi yĕvvari kiṁka nemisĕppene

(||tānŏ||)
pāyamŏkkaḍe guṟi pachchivalabulagĕllā
seyi sĕkkiḍigi guri siṁtalagunu
moyu niṭṭūrbulu guri manugŏnna korigagu
yeyĕḍa muchchaḍa liṁka nemisĕppene

(||tānŏ||)
kūḍinagūḍamulagu kŏnagorŏkkaḍe guri
yīḍanāgu śhreveṁkaḍeśhunigini
toḍane kaḽalu guṟi tudaleniveḍugagu
yeḍa nĕvvarigi niṁka nemi sĕppene