తానిటువంటివాఁడా తనగుణమిదిగాదు
(॥పల్లవి॥)
తానిటువంటివాఁడా తనగుణమిదిగాదు
పూని యీ వెరపు మతిఁ బుట్టించినదెవ్వతె
(॥తాని॥)
కొత్తకొత్తవలపులు కొంతకొంత నెరపుతా
వత్తునంటాఁ జెప్పెంపవలెనా నేఁడు
యిత్తలఁ దా వింతవాఁడా యెవ్వరన్నా వద్దనేరా
చిత్తములోనింత కొంకఁజేసినది యెవ్వతె
(॥తాని॥)
వేఁడివేఁడి తమకము వేసివేసి తనచేయి
వాఁడి నాచన్నులమోపవలెనా నేఁడు
పేఁడుకొనేమా చలము భేదమా తనకు నాకు
పోఁడిమి తనకునింత బుద్ధిచ్చినదెవ్వతె
(॥తాని॥)
ముద్దుముద్దుమాటల ముంచి ముంచి బాసలిచ్చి
వద్దనుండి గోరగీరవలెనా నేఁడు
అద్దుక శ్రీవేంకటేశుఁడన్నిటాఁదా నన్నుఁగూడె
తిద్దినట్టి తనపాలిదేవరైనదెవ్వతె
(||pallavi||)
tāniḍuvaṁṭivām̐ḍā tanaguṇamidigādu
pūni yī vĕrabu madim̐ buṭṭiṁchinadĕvvadĕ
(||tāni||)
kŏttagŏttavalabulu kŏṁtagŏṁta nĕrabudā
vattunaṁṭām̐ jĕppĕṁpavalĕnā nem̐ḍu
yittalam̐ dā viṁtavām̐ḍā yĕvvarannā vaddanerā
sittamuloniṁta kŏṁkam̐jesinadi yĕvvadĕ
(||tāni||)
vem̐ḍivem̐ḍi tamagamu vesivesi tanaseyi
vām̐ḍi nāsannulamobavalĕnā nem̐ḍu
pem̐ḍugŏnemā salamu bhedamā tanagu nāgu
pom̐ḍimi tanaguniṁta buddhichchinadĕvvadĕ
(||tāni||)
muddumuddumāḍala muṁchi muṁchi bāsalichchi
vaddanuṁḍi goragīravalĕnā nem̐ḍu
adduga śhrīveṁkaḍeśhum̐ḍanniḍām̐dā nannum̐gūḍĕ
tiddinaṭṭi tanabālidevarainadĕvvadĕ