తానిదె నేనిదె తగులై వున్నారము
(॥పల్లవి॥)
తానిదె నేనిదె తగులై వున్నారము
ఆనవెట్టి యీతగవు లడుగరే యాతని
(॥తాని॥)
చనవుగలుగుచోట సరసములాడవచ్చు
ననువుగలుగుచోట నవ్వవచ్చును
మనసుఁగానరానీక మతకాననుండేవానిఁ
జెనకఁ గవచ్చునటె చెప్పరే వోచెలులు
(॥తాని॥)
బత్తిగలిగితే మాఁటపలుకు లాడఁగవచ్చును
చిత్తగించితే సేవసేయవచ్చును
కొత్త సేసుకొని లోలో గుట్టుతోడనుండేవాని
హత్తి పట్టవచ్చునటె ఆడరే వోచెలులు
(॥తాని॥)
ప్రేమము నెలకొంటేను పెనఁగులాడఁగవచ్చు
కామించె నీవేళ నొక్కటిగావచ్చు
వేమారు శ్రీవేంకటేద్రివిభుఁ డిట్టే నన్నునేలె
అమాఁటాడవచ్చునటె యనరే వోచెలులు
(||pallavi||)
tānidĕ nenidĕ tagulai vunnāramu
ānavĕṭṭi yīdagavu laḍugare yādani
(||tāni||)
sanavugalugusoḍa sarasamulāḍavachchu
nanuvugalugusoḍa navvavachchunu
manasum̐gānarānīga madagānanuṁḍevānim̐
jĕnagam̐ gavachchunaḍĕ sĕppare vosĕlulu
(||tāni||)
battigaligide mām̐ṭabalugu lāḍam̐gavachchunu
sittagiṁchide sevaseyavachchunu
kŏtta sesugŏni lolo guṭṭudoḍanuṁḍevāni
hatti paṭṭavachchunaḍĕ āḍare vosĕlulu
(||tāni||)
premamu nĕlagŏṁṭenu pĕnam̐gulāḍam̐gavachchu
kāmiṁchĕ nīveḽa nŏkkaḍigāvachchu
vemāru śhrīveṁkaḍedrivibhum̐ ḍiṭṭe nannunelĕ
amām̐ṭāḍavachchunaḍĕ yanare vosĕlulu