Taanichchina sanavunam dadabadevaaramu

తానిచ్చిన చనవునఁ దడబడేవారము
Language

(॥పల్లవి॥)
తానిచ్చిన చనవునఁ దడబడేవారము
మోనముతోడుత నిట్టె మొక్కితి నేననవే

(॥తాని॥)
మగువలపంతములు మగవానిచేతివి
పగటునఁ జెల్లఁ బెట్టి పాలార్చను
మగడి తనతో మారుమాఁట లాడేవారమా
తగువు లెల్లాఁదానే తలఁచు కొమ్మనవే

(॥తాని॥)
చెలులమందెమేళాలు చేపట్టినవాని కింపు
పలుదెరఁగుల మెచ్చి పాలార్చను
బలిమి సేసినతన్నుఁబచారించేవార మా
నిలిచినతనవోజ నేరపుట గాక

(॥తాని॥)
నావలపు శ్రీవేంకటనాయకుఁడు
భావించి నన్ను నేలి పాలించను
యీవేళఁ దా నన్నుఁ గూడె నిది గాదనేవారమా
వేవేలకుఁ దానే జాణ వినుతించే నిఁకను

(||pallavi||)
tānichchina sanavunam̐ daḍabaḍevāramu
monamudoḍuda niṭṭĕ mŏkkidi nenanave

(||tāni||)
maguvalabaṁtamulu magavānisedivi
pagaḍunam̐ jĕllam̐ bĕṭṭi pālārsanu
magaḍi tanado mārumām̐ṭa lāḍevāramā
taguvu lĕllām̐dāne talam̐su kŏmmanave

(||tāni||)
sĕlulamaṁdĕmeḽālu sebaṭṭinavāni kiṁpu
paludĕram̐gula mĕchchi pālārsanu
balimi sesinadannum̐basāriṁchevāra mā
nilisinadanavoja nerabuḍa gāga

(||tāni||)
nāvalabu śhrīveṁkaḍanāyagum̐ḍu
bhāviṁchi nannu neli pāliṁchanu
yīveḽam̐ dā nannum̐ gūḍĕ nidi gādanevāramā
vevelagum̐ dāne jāṇa vinudiṁche nim̐kanu