తానెప్పుడు మాకు లోనే తగవైతేను
(॥పల్లవి॥)
తానెప్పుడు మాకు లోనే తగవైతేను
ఆనుకొని తానెంత అందాలు చూపీని
(॥తానె॥)
చెలులందరును నీకు సేవలు సేయఁగాను
చలముల నాపె నిన్ను జంకించీని
కలకాలము మేము కాఁపిరేలు సేయఁగాను
వెలినుండి తానేల వేడుక చూపీని
(॥తానె॥)
తరుణులిందరు వసంతము నీతోనాడఁగాను
సరుగన నాపె నిన్ను సన్న చేసీని
అరుదుగ నేమిట్టే యాండ్లమై యుండఁగాను
పొరుగున తానేమి పొందులు చూపీని
(॥తానె॥)
కాంతలిందరును నీతో కలసిమెలశుండఁగా
చెంతఁ దానేల నవ్వీని శ్రీవేంకటేశ
సంతతము మేము నీసరి కాఁగిటఁ గూడఁగా
బంతినుండి తానెట్టు బాగాలిచ్చీని
(||pallavi||)
tānĕppuḍu māgu lone tagavaidenu
ānugŏni tānĕṁta aṁdālu sūbīni
(||tānĕ||)
sĕlulaṁdarunu nīgu sevalu seyam̐gānu
salamula nābĕ ninnu jaṁkiṁchīni
kalagālamu memu kām̐pirelu seyam̐gānu
vĕlinuṁḍi tānela veḍuga sūbīni
(||tānĕ||)
taruṇuliṁdaru vasaṁtamu nīdonāḍam̐gānu
sarugana nābĕ ninnu sanna sesīni
aruduga nemiṭṭe yāṁḍlamai yuṁḍam̐gānu
pŏruguna tānemi pŏṁdulu sūbīni
(||tānĕ||)
kāṁtaliṁdarunu nīdo kalasimĕlaśhuṁḍam̐gā
sĕṁtam̐ dānela navvīni śhrīveṁkaḍeśha
saṁtadamu memu nīsari kām̐giḍam̐ gūḍam̐gā
baṁtinuṁḍi tānĕṭṭu bāgālichchīni