Taaneppudoo naavaamde tanasommu ne nidivo

తానెప్పుడూ నావాఁడే తనసొమ్ము నే నిదివో
Language

(॥పల్లవి॥)
తానెప్పుడూ నావాఁడే తనసొమ్ము నే నిదివో
పూని చుట్టరికా లీడఁ బొదిపి చెప్పనేలే

(॥తానె॥)
వులివచ్చిప్రియముల నొడంబరచఁగనేలే
వలచినయటువంటి వనితలను
తలఁపులుఁ దలఁపులు తారుకాణలై యుండఁగా
యెలమిఁ జెలుల చేతియెడమాట లేలే

(॥తానె॥)
తగవులఁ బెట్టిపెట్టి తమకమురేఁచనేలే
మొగమిచ్చలెనసినముదితలను
చిగురుమోవి నవ్వులు చిమ్మిరేణగియుండఁగాను
తగువైనపొందు లిఁకఁ దడవంగనేలే

(॥తానె॥)
చేఁగదేర వినయపుచేతలు సేయఁగనేలే
కాఁగిటిలోనుండేటికాంతలను
దాఁగ కలమేల్మంగను తాను శ్రీవేంకటేశుఁడు
వీఁగక నన్నేలె నిఁక వింత సేయనేలే

(||pallavi||)
tānĕppuḍū nāvām̐ḍe tanasŏmmu ne nidivo
pūni suṭṭarigā līḍam̐ bŏdibi sĕppanele

(||tānĕ||)
vulivachchipriyamula nŏḍaṁbarasam̐ganele
valasinayaḍuvaṁṭi vanidalanu
talam̐pulum̐ dalam̐pulu tārugāṇalai yuṁḍam̐gā
yĕlamim̐ jĕlula sediyĕḍamāḍa lele

(||tānĕ||)
tagavulam̐ bĕṭṭibĕṭṭi tamagamurem̐sanele
mŏgamichchalĕnasinamudidalanu
sigurumovi navvulu simmireṇagiyuṁḍam̐gānu
taguvainabŏṁdu lim̐kam̐ daḍavaṁganele

(||tānĕ||)
sem̐gadera vinayabusedalu seyam̐ganele
kām̐giḍilonuṁḍeḍigāṁtalanu
dām̐ga kalamelmaṁganu tānu śhrīveṁkaḍeśhum̐ḍu
vīm̐gaga nannelĕ nim̐ka viṁta seyanele