Taanemta nenemta tarunulaala

తానెంత నేనెంత తరుణులాల
Language

(॥పల్లవి॥)
తానెంత నేనెంత తరుణులాల
పూని యీతఁడెంత సేసీ పొసగఁగ వినరే

(॥॥)
పలికి బొంకనివాఁడు పంతగాఁడు తానన్నిటా
నిలువు నూరు వండేటి నెరజాణఁడు
పిలిచి వీడెము వెట్టెఁ బ్రియములెల్లాఁ జెప్పె
కలసినాఁడు నేనంత ఘనురాలనా

(॥॥)
కడుఁ బ్రతాపపువాఁడు కాఁకలు దేరినవాఁడు
విడువని చలముల వేడుకకాఁడు
వొడివట్టి తీసి నాకు నుంగరము వేలఁ బెట్టి
అడరి మన్నించె నేనంత నేరుపరినా

(॥॥)
చక్కఁదనములవాఁడు చల్లని మాటలవాఁడు
వెక్కసపు నవ్వుల శ్రీవేంకటేశుఁడు
అక్కరతో నను నేలె నలమేలుమంగను
మిక్కిలిఁ జొక్కించె నింత మేలుదాననా

(||pallavi||)
tānĕṁta nenĕṁta taruṇulāla
pūni yīdam̐ḍĕṁta sesī pŏsagam̐ga vinare

(||||)
paligi bŏṁkanivām̐ḍu paṁtagām̐ḍu tānanniḍā
niluvu nūru vaṁḍeḍi nĕrajāṇam̐ḍu
pilisi vīḍĕmu vĕṭṭĕm̐ briyamulĕllām̐ jĕppĕ
kalasinām̐ḍu nenaṁta ghanurālanā

(||||)
kaḍum̐ bradābabuvām̐ḍu kām̐kalu derinavām̐ḍu
viḍuvani salamula veḍugagām̐ḍu
vŏḍivaṭṭi tīsi nāgu nuṁgaramu velam̐ bĕṭṭi
aḍari manniṁchĕ nenaṁta nerubarinā

(||||)
sakkam̐danamulavām̐ḍu sallani māḍalavām̐ḍu
vĕkkasabu navvula śhrīveṁkaḍeśhum̐ḍu
akkarado nanu nelĕ nalamelumaṁganu
mikkilim̐ jŏkkiṁchĕ niṁta meludānanā