Taanemta nenemta taravaadi panulemta

తానెంత నేనెంత తరవాతి పనులెంత
Language

(॥పల్లవి॥)
తానెంత నేనెంత తరవాతి పనులెంత
కానుక చేకొన్నదే కలిమెల్లాఁ గాదా

(॥తానెంత॥)
చెప్పనేలే ప్రియములు సారెసారెఁ
గొప్పు దువ్వినదే నాకుఁ గోటి గాదా
కప్పుర మియ్యఁగనేలే కమ్మటిని దోసెఁడేసి
రెప్పలెత్తి చూచుటే మీరిననిధి గాదా

(॥తానెంత॥)
వీసమంతపనికిఁగా వెడ్డువెట్టి వెఁడనేలే
చేసన్న సేసినదే సేనగాదా
వేసరక యేడ లేనివిరులు ముడువనేలే
సేసవెట్టినదే మేలు చేతికిచ్చుట గాదా

(॥తానెంత॥)
శ్రీవేంకటేశుఁడు నన్నుఁ జెయివట్టి తియ్యనేలే
యీవల నాతో నవ్వుటే యిన్నియుఁగాదా
కావించి నామేన నిండా గంధము వూయఁగనేలే
యీవేళ నన్నిట్టే కూడె నెక్కుడు గాదా

(||pallavi||)
tānĕṁta nenĕṁta taravādi panulĕṁta
kānuga segŏnnade kalimĕllām̐ gādā

(||tānĕṁta||)
sĕppanele priyamulu sārĕsārĕm̐
gŏppu duvvinade nāgum̐ goḍi gādā
kappura miyyam̐ganele kammaḍini dosĕm̐ḍesi
rĕppalĕtti sūsuḍe mīrinanidhi gādā

(||tānĕṁta||)
vīsamaṁtabanigim̐gā vĕḍḍuvĕṭṭi vĕm̐ḍanele
sesanna sesinade senagādā
vesaraga yeḍa lenivirulu muḍuvanele
sesavĕṭṭinade melu sedigichchuḍa gādā

(||tānĕṁta||)
śhrīveṁkaḍeśhum̐ḍu nannum̐ jĕyivaṭṭi tiyyanele
yīvala nādo navvuḍe yinniyum̐gādā
kāviṁchi nāmena niṁḍā gaṁdhamu vūyam̐ganele
yīveḽa nanniṭṭe kūḍĕ nĕkkuḍu gādā