తానెంత నేనెంత తమకించీ నింతెకాక
(॥పల్లవి॥)
తానెంత నేనెంత తమకించీ నింతెకాక
పూని తన చేఁతలకే పులకించీ మేను
(॥తానెంత॥)
తప్పక చూచె వాఁడే తానె యిందు వచ్చెవీఁడే
కొప్పు దువ్వె నిదె వీఁడే కొలువులోన
యెప్పుడు నావంటివారు యెందరు లేరు తనకు
కప్పిన యీమన్ననకే కరఁగీ నామనసు
(॥తానెంత॥)
సరిమాటలాడీ వాఁడే సారెఁ జెనకీ వీఁడే
మురిపెపు చన్నులు చేముట్టీ వాఁడే
నిరతి జాణ తానైతే నేనేమి బాఁతి తనకు
యిరవై యిందుకే తలకెక్కీ నావలపు
(॥తానెంత॥)
వెంట వెంట వచ్చీ వాఁడే వేసాలు సేసీ వాఁడే
నంటు మంచానకుఁ దీసి నవ్వీ వీఁడే
వొంటినే శ్రీవేంకటాద్రినుండి వచ్చి నూఁడుకూర
అంటీ కేశవరాయఁడై అరుదైతి నేను
(||pallavi||)
tānĕṁta nenĕṁta tamagiṁchī niṁtĕgāga
pūni tana sem̐talage pulagiṁchī menu
(||tānĕṁta||)
tappaga sūsĕ vām̐ḍe tānĕ yiṁdu vachchĕvīm̐ḍe
kŏppu duvvĕ nidĕ vīm̐ḍe kŏluvulona
yĕppuḍu nāvaṁṭivāru yĕṁdaru leru tanagu
kappina yīmannanage karam̐gī nāmanasu
(||tānĕṁta||)
sarimāḍalāḍī vām̐ḍe sārĕm̐ jĕnagī vīm̐ḍe
muribĕbu sannulu semuṭṭī vām̐ḍe
niradi jāṇa tānaide nenemi bām̐ti tanagu
yiravai yiṁduge talagĕkkī nāvalabu
(||tānĕṁta||)
vĕṁṭa vĕṁṭa vachchī vām̐ḍe vesālu sesī vām̐ḍe
naṁṭu maṁchānagum̐ dīsi navvī vīm̐ḍe
vŏṁṭine śhrīveṁkaḍādrinuṁḍi vachchi nūm̐ḍugūra
aṁṭī keśhavarāyam̐ḍai arudaidi nenu