Taanemta nenemta talabosi soosidenu

తానెంత నేనెంత తలపోసి చూచితేను
Language

(॥పల్లవి॥)
తానెంత నేనెంత తలపోసి చూచితేను
కానికిచ్చి తన మతి కరఁగించేనా

(॥తానెం॥)
కేలుచాఁచి నాగుబ్బలు గిలిగించీ నూరకే
నాలికాఁడు తనతో నవ్వేనా నేను
పాలుపడి నన్ను నిట్టె పాదాలు విసుకుమనీ
మేలువాఁడు తను మెప్పించేనా

(॥తానెం॥)
పలుమారు నాతోను పైకొని పెనఁగీని
చలపాదివాఁడు తాను సాముసేసేనా
తిలకించి యిటు నన్ను దిష్టించి చూచీని
బలిమికాఁ డన్నిటాను పంతమాడేనా

(॥తానెం॥)
జోడుగూడి నన్నిట్టె చొక్కించీని రతులను
కోడెకాఁడు తన్ను నే గోరగీరేనా
యీడనె శ్రీవేంకటేశుఁ డిన్నిటా నన్నాదరించె
పాడిగలవాఁడు తాను బాసగొనేనా

(||pallavi||)
tānĕṁta nenĕṁta talabosi sūsidenu
kānigichchi tana madi karam̐giṁchenā

(||tānĕṁ||)
kelusām̐si nāgubbalu giligiṁchī nūrage
nāligām̐ḍu tanado navvenā nenu
pālubaḍi nannu niṭṭĕ pādālu visugumanī
meluvām̐ḍu tanu mĕppiṁchenā

(||tānĕṁ||)
palumāru nādonu paigŏni pĕnam̐gīni
salabādivām̐ḍu tānu sāmusesenā
tilagiṁchi yiḍu nannu diṣhṭiṁchi sūsīni
balimigām̐ ḍanniḍānu paṁtamāḍenā

(||tānĕṁ||)
joḍugūḍi nanniṭṭĕ sŏkkiṁchīni radulanu
koḍĕgām̐ḍu tannu ne goragīrenā
yīḍanĕ śhrīveṁkaḍeśhum̐ ḍinniḍā nannādariṁchĕ
pāḍigalavām̐ḍu tānu bāsagŏnenā