తానెంత నేనెంత దగ్గరేపాటిదా
(॥పల్లవి॥)
తానెంత నేనెంత దగ్గరేపాటిదా
పానిపట్టి నీవు చేపట్టఁగానే కాక
(॥తానెం॥)
మచ్చిక నీతో నాపె మాటలాడఁగాఁగదా
వొచ్చెమని ఆవేళ నూరకుంటిని
యెచ్చి అంతనాతోను యెదురాడేపాటిదా
నిచ్చలు నసమిచ్చిననీవల్లఁగాక
(॥తానెం॥)
యిరవై అంగన నీయింటిలో నుండఁగగదా
సరవితో నావేళకు సమ్మతించితి
పొరుగుపొంతలనుండి పొందు సేసే పాటిదా
మరిగి కాచుకున్న నీమన్నించఁగఁ గాక
(॥తానెం॥)
పనివేళ నీకుఁ జెలి పాదాలొత్తఁగఁగదా
కని వూడిగపుదని కై కొంటిని
యెనసి శ్రీ వేంకటేశ నన్ను యింతటిదా
ననలుగా నీవు గొంత నవ్వఁగాఁగాక
(||pallavi||)
tānĕṁta nenĕṁta daggarebāḍidā
pānibaṭṭi nīvu sebaṭṭam̐gāne kāga
(||tānĕṁ||)
machchiga nīdo nābĕ māḍalāḍam̐gām̐gadā
vŏchchĕmani āveḽa nūraguṁṭini
yĕchchi aṁtanādonu yĕdurāḍebāḍidā
nichchalu nasamichchinanīvallam̐gāga
(||tānĕṁ||)
yiravai aṁgana nīyiṁṭilo nuṁḍam̐gagadā
saravido nāveḽagu sammadiṁchidi
pŏrugubŏṁtalanuṁḍi pŏṁdu sese pāḍidā
marigi kāsugunna nīmanniṁcham̐gam̐ gāga
(||tānĕṁ||)
paniveḽa nīgum̐ jĕli pādālŏttam̐gam̐gadā
kani vūḍigabudani kai kŏṁṭini
yĕnasi śhrī veṁkaḍeśha nannu yiṁtaḍidā
nanalugā nīvu gŏṁta navvam̐gām̐gāga